భారతదేశంలో స్మార్ట్ వాచ్‌ల వినియోగం విపరీతంగా పెరిగింది. గత రెండుమూడు దశాబ్దాల నుంచి భారతీయ డ్రెస్సింగ్ స్టైల్లో వాచ్ అనేది సర్వసాధారణమైపోయింది. అయితే స్మార్ట్ ఫోన్‌ల రాకతో వాచ్ వాడే వారి సంఖ్య తగ్గింది. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో స్మార్ట్‌వాచ్‌లు రాకతో మళ్లీ వాచ్‌లు ధరించే వారి సంఖ్య క్రమంగా పెరిగింది. అలాగే ఈ స్మార్ట్ వాచ్‌లో టైమ్‌తో పాటు ఆరోగ్య వివరాల అప్‌డేట్లతో పాటు బ్లూటూత్ సాయంతో ఫోన్‌కు కనెక్ట్ చేసుకునే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది స్మార్ట్‌వాచ్‌లను ఇష్టపడుతున్నారు. ఆరోగ్య అప్‌డేట్ వివరాల కోసం మధ్య వయస్కులు కూడా ఈ స్మార్ట్ వాచ్‌లను ఉపయోగిస్తున్నారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్ని కంపెనీలు కూడా సరికొత్తగా వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా హియర్‌మో కంపెనీ హియర్ ఫిట్ ఆర్‌ఎస్(ఎస్‌ఈ) పేరుతో సరికొత్త స్మార్ట్ వాచ్‌ను రిలీజ్ చేసింది. దీని ధర రూ.7,999గా ఉండగా, ప్రస్తుతం పరిచయ ఆఫర్ కింద రూ.1,999గా ఉంటుంది. ఈ వాచ్ ఆఫ్‌లైన్ రిటైలర్లతో పాటు అమెజాన్, హియర్‌మో కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఈ వాచ్ ఫీచర్ల గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.
హియర్‌మో కంపెనీ స్మార్ట్‌వాచ్ 420×485 రిజల్యూషన్‌తో వస్తుంది. అలాగే ఈ వాచ్ సన్నని బెజెల్స్‌తో రావడంతో 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అలాగే ఈ వాచ్ 2 అంగుళాల ఫుల్ వ్యూ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ యాపిల్ వాచ్‌ని పోలి ఉండేలా స్క్రీన్‌తో మెటాలిక్ బిల్డ్‌తో వస్తుంది. స్లీప్ మానిటరింగ్, హార్ట్ రేట్ మ్యాపింగ్, బ్లడ్ ఆక్సిజన్ ట్రాకింగ్, మరిన్ని ఆరోగ్య సంబంధిత ట్రాకర్లతో వస్తుంది. అలాగే ఈ వాచ్‌తో 100కి పైగా స్పోర్ట్స్, ఫిట్‌నెస్ మోడ్‌లకు సపోర్ట్‌తో చేస్తుంది. అలాగే ఈ వాచ్‌ను వివిధ వాచ్ ఫేస్‌లతో అనుకూలీకరించవచ్చు. అలాగే ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. నీరు, ధూళి రక్షణ కోసం ఐపీ 68 రేటింగ్ అనేది ఈ వాచ్ ప్రత్యేక లక్షణాల్లో ఒకటి. ఈ స్మార్ట్ వాచ్ బ్లాక్, ఆర్మీ గ్రీన్ అనే రెండు కలర్ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..