భారతదేశంలో ప్రస్తుతం స్మార్ట్ వాచ్ ట్రెండ్ నడుస్తుంది. గతంలో కేవలం సమయం చూసుకోవడానికి మాత్రమే వాచ్‌లు ఉపయోగించేవారు. క్రమేపి వాచ్‌ల్లో కూడా కొత్త అప్‌డేట్స్ రావడంతో మొబైల్‌తో కనెక్ట్ చేసుకునేలా స్మార్ట్‌వాచ్‌లు విరివిగా మార్కెట్‌లో రిలీజ్ అవుతున్నాయి. కేవలం సమయం చూసుకోవడానికి మాత్రమే కాకుండా ఆరోగ్య అప్‌డేట్స్‌తో పాటు బ్లూటూత్ ద్వారా కాల్స్ రిసీవ్ చేసుకునే సదుపాయాలు ఉండడంతో యువత ఎక్కువగా వీటిని వాడుతున్నారు. అయితే వస్త్రధారణలో భారతదేశంలో పురుషులకు, స్త్రీలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే స్మార్ట్‌వాచ్‌లు మాత్రం యూనీసెక్స్ ఆప్షన్స్‌లో రావడంతో ట్రెడెషినల్‌గా రెడీ అయినప్పుడు మహిళలకు స్మార్ట్‌వాచ్‌లు ధరించడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ నాయిస్ మహిళల కోసం ప్రత్యేకంగా ఓ స్మార్ట్ వాచ్‌ను రూపొందించింది. నాయిస్ ఫిట్ దివా పేరుతో రిలీజ్ చేసిన ఈ స్మార్ట్ వాచ్ మెటాలిక్, గ్లోసీ డయల్ ఫినిషింగ్‌తో వస్తుంది. ఈ ఫినిషింగ్ కచ్చితంగా మహిళలను విపరీతంగా ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాబట్టి ఈ నాయిస్ ఫిట్ దివా స్మార్ట్ వాచ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
నాయిస్ ఫిట్ దివా స్మార్ట్ వాచ్ ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే (ఏఓడీ) టెక్నాలజీతో కూడిన 1.1 ఇంచుల ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ముఖ్యంగా డైమండ్-కట్ డయల్ వాచ్ డిజైన్ సౌందర్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఈ నాయిస్ ఫిట్ దివా వాచ్ నాయిస్ వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో కొనుగోలు అందుబాటులో ఉంది. అలాగే ఈ వాచ్ ధర రూ.2999గా ఉంది. నాయిస్ ఫిట్ దివా వాచ్లో బ్లూటూత్ కాలింగ్‌తో పాటు నాయిస్ బజ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్ ద్వారా వినియోగదారులు ఇటీవలి కాల్ లాగ్‌లను యాక్సెస్ చేయవచ్చు. ఈ వాచ్‌లో గరిష్టంగా 10 పరిచయాలను సేవ్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ ఏఐ వాయిస్ అసిస్టెంట్‌తో పని చేస్తుంది. కాబట్టి స్మార్ట్‌ఫోన్ అసిస్టెంట్‌తో చాలా సింపుల్‌గా కనెక్ట్ అవుతుంది.
అలాగే ఈ వాచ్ సిరితో పాటు గూగుల్‌కు వాయిస్ అసిస్టెంట్‌కు మద్దతునిస్తుంది. ఆ స్మార్ట్ వాచ్ ఉత్పాదకత. ఆరోగ్య పర్యవేక్షణ కార్యాచరణల శ్రేణిని అందిస్తుంది. ఆ వాచ్‌ను ఓ సారి చార్జ్ చేస్తే బ్యాటరీ 4 రోజుల వరకు బ్యాకప్‌ను ఇస్తుంది. ఇది నిరంతరం కదలికలో ఉండే మహిళలకు అనువుగా ఉంటుంది.ఘీ స్మార్ట్ వాచ్ ఐపీ 67 నీరు, ధూళి నిరోధకతను కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ వినియోగదారులకు హృదయ స్పందన రేటు పర్యవేక్షణ, ఎస్పీఓ2 ట్రాకింగ్, నిద్ర పర్యవేక్షణ, ఒత్తిడి కొలత, శ్వాస అభ్యాసం, స్త్రీ రుతుచక్ర ట్రాకర్ వంటి వెల్నెస్ ఫీచర్లను అందిస్తుంది. నాయిస్ ఫిట్ దియా ఉత్పాదకత సూట్‌ను కూడా కలిగి ఉంది. వినియోగదారులు రోజువారీ రిమైండర్‌లు, వాతావరణ సూచనలను, అంతర్నిర్మిత క్యాలెండర్‌ను యాక్సెస్ చేయడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఈ వాచ్‌లో 100 ప్లస్ స్పోర్ట్స్ మోడ్‌లు, 100 ప్లస్ వాచ్ ఫేస్‌లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. అలాగే ఈ వాచ్ నాయిస్ ఫిట్ యాప్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..