WhatsApp: న్యూ ఇయర్ వేళ వాట్సప్ వాడేవారికి గుడ్‌న్యూస్.. అద్భుత ఫీచర్ లాంచ్.. ఒక్కసారి చూడండి

వాట్సప్ యూజర్లకు మరో భారీ శుభవార్త. ఎప్పటికప్పుడు వాట్సప్‌లో అనేక కొత్త రకాల ఫీచర్లు వస్తోన్నాయి. యూజర్ల ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపర్చేందుకు వాట్సప్ ప్రయత్నిస్తోంది. త్వరలో మరో కొత్త ఫీచర్‌ను కూడా లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ఆ ఫీచర్ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

WhatsApp: న్యూ ఇయర్ వేళ వాట్సప్ వాడేవారికి గుడ్‌న్యూస్.. అద్భుత ఫీచర్ లాంచ్.. ఒక్కసారి చూడండి
Whats App

Updated on: Dec 28, 2025 | 6:47 PM

ప్రముఖ ఇన్‌స్టంట్ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ త్వరలోనే మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. గ్రూప్ చాట్స్‌కు ఉపయోగపడేలా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అయింది. కొన్నిసార్లు వాట్సప్ గ్రూపుల్లో కొంతమంది పేర్లు ఒకేలా ఉంటాయి. ఇలాంటి సమయంలో ఎవరికి మెస్సేజ్ పంపాలనేది అర్థం కాదు. ప్రొఫైల్ ఫొటో లేకపోతే వారిని గుర్తించడం చాలా కష్టం. వాట్సప్ గ్రూపులో వందలాది మంది సభ్యులు ఉన్నప్పుడు ఒకే పేరు ఉన్నవారిని గుర్తించడం కష్టమవుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు వాట్సప్ త్వరలో కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది.

ప్రొఫైల్ ఐకాన్ ఫీచర్

వాట్సప్ గ్రూపుల్లో కొత్త ప్రొఫైల్ ఐకాన్ ఫీచర్‌ను వాట్సప్ తీసుకొస్తుంది. దీని వల్ల వాట్సప్ గ్రూపుల్లో ప్రతీ ప్రొఫైల్ పక్కన ఐకాన్ కనిపిస్తుంది. దీని వల్ల సెండర్‌ను ఇన్‌స్టంట్‌గా గుర్తించవచ్చు. అంతేకాకుండా ప్రొఫైల్ ఐకాన్‌నే కాకుండా బేసిక్ ఇన్పర్మేషన్ అక్కడే కనిపిస్తుంది. దీని వల్ల ఎవరు మెస్సేజ్ పంపారో సులువుగా గుర్తించవచ్చు. అలాగే ప్రొఫైల్ ఫొటో లేని యూజర్లకు డిఫాల్ట్ ఐకాన్ ఇస్తుంది. దీని వల్ల గ్రూప్ మెంబర్లు సులువుగా పార్టిసిపెంట్స్‌ను గుర్తించవచ్చు. ప్రస్తుతం బీటా వెర్షన్ 2.23.12.7 వెర్షన్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఈ ఫీచర్ ఉండగా.. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. టెస్టింగ్ దశలో బగ్స్‌ను గుర్తించే పనిలో వాట్సప్ పడింది. బగ్‌లను క్లియర్ చేశాక యూజర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనుంది. అనంతరం మార్పులు చేసి ఈ ఫీచర్‌న లాంచ్ చేయనుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లకు ఒకేలా ఈ ఫీచర్ రోల్ అవుట్ చేయనుంది.

కాగా వాట్సప్ ఇటీవల యూజర్ల కోసం అనేక ఫీచర్లను తీసుకొస్తుంది. ఎప్పటికప్పుడు ఫీచర్లను అప్‌డేట్ చేస్తోంది. ఇటీవల వీడియో కాల్, వాయిస్ కాల్స్ నోట్స్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. అలగే మరిన్ని ఎమోజీలను తమ ఫ్లాట్‌ఫామ్‌లో చేర్చింది. ఇలా ఇతర ఫ్లాట్‌ఫామ్స్‌కు పోటీగా యూజర్లను ఆకట్టుకునేందుకు మెస్మరైజింగ్ ఫీచర్లను లాంచ్ చేస్తోంది.