ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారులకు టాటా పవర్ గుడ్‌న్యూస్..!
ఇప్పటి వరకు ఈవీ కార్లు ఉన్న వినియోగదారులు.. మార్గ మధ్యలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు లేవని ఇబ్బందులు పడేవారు. ఇక వారి ఇబ్బందులకు టాటా పవర్ సంస్థ చెక్ పెట్టింది. సంస్థ.. ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో ఏడాదిలోగా 700 విద్యుత్ వాహన ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇప్పటికే ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, పుణె నగరాల్లో 100 ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సంస్థ అధికారులు […]

ఇప్పటి వరకు ఈవీ కార్లు ఉన్న వినియోగదారులు.. మార్గ మధ్యలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు లేవని ఇబ్బందులు పడేవారు. ఇక వారి ఇబ్బందులకు టాటా పవర్ సంస్థ చెక్ పెట్టింది. సంస్థ.. ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో ఏడాదిలోగా 700 విద్యుత్ వాహన ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇప్పటికే ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, పుణె నగరాల్లో 100 ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సంస్థ అధికారులు తెలిపారు. వచ్చే మార్చి కల్లా మరో 300 కేంద్రాలకు ప్రణాళికలు రచిస్తోందన్నారు.
ఈ సందర్భంగా కంపెనీ సీఈవో ప్రవీర్ సిన్హా మాట్లాడుతూ.. మేము ఇప్పటివరకు ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్స్ )లను విడుదల చేసిన ప్రాంతాల్లో ఈ ఛార్జింగ్ కేంద్రాలను ఇన్‌స్టాల్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామన్నారు. వచ్చే ఏడాది కల్లా 700 ఈవీలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కేవలం పబ్లిక్ స్థలాల్లోనే కాకుండా.. ఇంటి పరిసరాల్లో కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడంపైనా కూడా సంస్థ దృష్టి పెట్టిందన్నారు. మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్, థియేటర్స్ వంటి ముఖ్యమైన స్థలాల్లో ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం మెట్రో రైల్వే అధికారులతో, మున్సిపల్ కార్పొరేషన్లతో చర్చలు జరుగుతున్నాయన్నారు. కాగా, ఇప్పటికే టాటా పవర్ సంస్థ.. హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, ఐజీఎల్ రిటైల్ అవుట్‌లెట్లలోనూ కమర్షియల్ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు డీల్ కుదుర్చుకుంది.