ఆఫ్ఘన్‌లో తాలిబన్ల పైశాచికం.. 20 మంది మృతి

Taliban car bomb kills at least 20 in southern Afghanistan, ఆఫ్ఘన్‌లో తాలిబన్ల పైశాచికం.. 20 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్ గురువారం పేలుళ్లతో దద్ధరిళ్లిపోయింది. జాబుల్ ప్రాంతంలో జరిగిన పేలుడులో పదుల సంఖ్యలో మృతి చెందారు. ఓ ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో నిలిపి ఉంచిన ట్రక్కులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇరవై మందికిపైగా మృతి చెందారు. మరో 85 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన జరిగిన తర్వాత సమీప ప్రాంతంలోని భవనాలు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. అయితే ఘటన జరిగిన సమీపంలోనే నేషనల్ డిఫెన్స్ సర్వీస్ కార్యాలయం ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ నేషనల్ డిఫెన్స్ సర్వీస్‌ కార్యాలయాన్ని టార్గెట్‌ చేసే ఈ దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఈ దాడికి పాల్పడింది తామేనంటూ తాలిబన్లు ప్రకటించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *