ఈ సారి టీమిండియా.. సఫారీల సంగతి తేల్చుతుందా..?

టీమిండియా.. సొంతగడ్డపై ఎలా ఆడుతుందో అందరికీ తెలిసిందే. ఏ ఫార్మాట్‌లోనైనా.. ప్రత్యర్థి ఎంత బలమైన జట్టైనా.. తలవంచాల్సిందే. అయితే ముఖ్యంగా టీ20లో దాదాపు అన్ని దేశాలపై టీమిండియాదే పైచేయి.. అయితే ఒక్క సౌత్ ఆఫ్రికా ఒక్కటి మాత్రం భారత్‌పై పైచేయి సాధించింది. ఇరు జట్ల మధ్య భారత్‌లో ఒక్కసారే టీ20 సిరీస్‌ జరిగింది. అయితే అందులో సఫారీలే విజయం సాధించారు. అయితే రేపటి నుంచి ప్రారంభమవ్వనున్న మూడు మ్యాచ్‌ల టీ20సిరీస్‌ను కోహ్లి సేన చేజిక్కించుకుంటే.. ఇక దాదాపు […]

ఈ సారి టీమిండియా.. సఫారీల సంగతి తేల్చుతుందా..?
Follow us

| Edited By:

Updated on: Sep 14, 2019 | 12:46 PM

టీమిండియా.. సొంతగడ్డపై ఎలా ఆడుతుందో అందరికీ తెలిసిందే. ఏ ఫార్మాట్‌లోనైనా.. ప్రత్యర్థి ఎంత బలమైన జట్టైనా.. తలవంచాల్సిందే. అయితే ముఖ్యంగా టీ20లో దాదాపు అన్ని దేశాలపై టీమిండియాదే పైచేయి.. అయితే ఒక్క సౌత్ ఆఫ్రికా ఒక్కటి మాత్రం భారత్‌పై పైచేయి సాధించింది. ఇరు జట్ల మధ్య భారత్‌లో ఒక్కసారే టీ20 సిరీస్‌ జరిగింది. అయితే అందులో సఫారీలే విజయం సాధించారు. అయితే రేపటి నుంచి ప్రారంభమవ్వనున్న మూడు మ్యాచ్‌ల టీ20సిరీస్‌ను కోహ్లి సేన చేజిక్కించుకుంటే.. ఇక దాదాపు అన్ని జట్లపై పైచేయి సాధించినట్లవుతుంది.

అయితే సౌత్ ఆఫ్రికా గడ్డపై జరిగిన నాలుగు సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత్.. సొంతగడ్డపై సీరీస్ గెలవలేదు. ఈసారి భారత్ ఆ లోటును భర్తీ చేయాలన్న టార్గెట్‌తో ఉంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. రేపు ఆదివారం ధర్మశాలలో జరిగే తొలి టి20తో సిరీస్‌కు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే సఫారీలను తక్కువంచనా వేయడానికి లేదు. సౌత్ ఆఫ్రికా జట్టులో ఉన్న యువ క్రికెటర్లు దాదాపు భారత గడ్డపై ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. అంతేగాక టీ20 మ్యాచుల్లో సఫారీలు ఎప్పుడూ డేంజర్ అన్న పేరు ఉంది. వారితో పోరు ఎప్పుడూ క్లిష్టంగానే ఉంటుంది. ఇదిలా ఉంటే యువ, సీనియర్ ఆటగాళ్లతో కూడిన టీమిండియా ఈసారి విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. సొంత గడ్డపై సఫారీలపై తొలి టి20 సిరీస్‌ను గెలుచుకోవాలని తహతహలాడుతోంది.

ఫామ్‌లో కెప్టెన్, వైస్ కెప్టెన్

కాగా, ఇటీవలే వెస్టిండీస్‌తో జరిగిన సీరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసి.. మంచి జోరుమీదుంది. దీంతో ఈ సిరీస్‌‌ను కూడా క్లీన్ స్వీప్ చేసే దిశగా సమరోత్సాహంతో సిద్ధమైంది. కెప్టెన్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు మంచి ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. వీరిక తోడుగా శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, హర్థిక్ పాండ్య, కృనాల్ పాండ్యలు జట్టుకు అందుబాటులో ఉన్నారు. దీంతో ఈసారి సిరీస్ గెలవడం టీమిండియాకు కష్టం కాక పోవచ్చు.

ఇప్పటి వరకు భారత్‌దే పైచేయి

ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లలో భారత్‌దే పైచేయిగా ఉంది. భారత్, సౌత్ ఆఫ్రికాల మధ్య ఇప్పటి వరకు ఐదు ద్వైపాక్షిక టి20 సిరీస్‌లు జరిగాయి. ఇందులో భారత్ నాలుగు సీరీస్‌లను గెలుచుకుంది. అయితే ఈ నాలుగు సిరీస్‌లు కూడా దక్షిణాఫ్రికా గడ్డపైనే సాధించింది. ఇక, దక్షిణాఫ్రికా ఒక సీరీస్‌ను ఎగరేసుకుపోయింది. అది కూడా భారత్ సొంత గడ్డపై నుంచి. దీన్ని బట్టి చూస్తే.. సొంత గడ్డపై జరిగే సిరీస్‌లు ఆతిథ్య జట్లకు కలిసి రావడం లేదనే విషయం అర్ధమవుతోంది. ఇప్పటి వరకు భారత్‌దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 8 మ్యాచులను గెలవగా.. సౌత్ ఆఫ్రికా ఐదు మ్యాచులను నెగ్గింది. అయితే ఈ సారి కోహ్లీ సేనా ఆతిథ్య జట్టుపై నెగ్గి.. రికార్డు సృష్టిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.