అండర్-19: ఆసియా కప్‌ గెలుచుకున్న టీం ఇండియా

అండర్-19: ఆసియా కప్‌ గెలుచుకున్న టీం ఇండియా
IND U19 vs BAN U19

అండర్-19 ఆసియా కప్‌లో భారత కుర్రాళ్లు సత్తా చాటారు. వన్డే ఇంటర్నేషనల్ అండర్-19 ఆసియా కప్‌ను భారత్ కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. శనివారం శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 32.4 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో షమీమ్ హొసైన్‌, మృతుంజయ్ చౌధురిలు భారత్ బ్యాటింగ్ ఆర్డరును చెదరగొట్టారు. కేవలం భారత […]

Ram Naramaneni

|

Sep 15, 2019 | 5:25 AM

అండర్-19 ఆసియా కప్‌లో భారత కుర్రాళ్లు సత్తా చాటారు. వన్డే ఇంటర్నేషనల్ అండర్-19 ఆసియా కప్‌ను భారత్ కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. శనివారం శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 32.4 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో షమీమ్ హొసైన్‌, మృతుంజయ్ చౌధురిలు భారత్ బ్యాటింగ్ ఆర్డరును చెదరగొట్టారు. కేవలం భారత కెప్టెన్ ధ్రువ్ జురెల్ (33), కరణ్ లాల్(37), శష్వత్ రావత్ (19)లు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగతా ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. అయితే 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు ఛేధనకు దిగిన బంగ్లాదేశ్ జట్టు 33 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటయ్యింది. భారత బౌలర్లు అథర్వ, ఆకాశ్ సింగ్ విజృంభించగా, బంగ్లాదేశ్ 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన అథర్వ 5 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu