AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడే సఫారీలతో తొలి టీ20.. వర్షం ముప్పు తప్పదా.. !

వెస్టిండీస్ టూర్‌ను దిగ్విజయంగా ముగించుకున్న టీమిండియా.. ఇవాళ్టి నుంచి సౌత్ ఆఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సీరీస్‌కి సిద్ధమైంది. ఈ సీరీస్‌లో భాగంగా ఇవాళ ధర్మశాలలోని HPCA స్టేడియంలో రాత్రి 7.00 గంటలకు తొలి మ్యాచ్‌ జరగనుంది. అయితే మొన్న ప్రపంచకప్‌కు వచ్చిన అనుకోని అతిథి ఇక్కడ కూడా రాబోతున్నాడన్న భయం ఉంది. అదేనండి వర్షం.. మొన్న ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు వర్షం ఎఫెక్ట్‌తో చాలా మ్యాచ్‌లు రద్దయ్యాయి. అయితే సఫారీలతో జరుగుతున్న టీ20 సీరీస్‌ తొలి మ్యాచ్‌కు […]

నేడే సఫారీలతో తొలి టీ20.. వర్షం ముప్పు తప్పదా.. !
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 15, 2019 | 12:31 PM

Share

వెస్టిండీస్ టూర్‌ను దిగ్విజయంగా ముగించుకున్న టీమిండియా.. ఇవాళ్టి నుంచి సౌత్ ఆఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సీరీస్‌కి సిద్ధమైంది. ఈ సీరీస్‌లో భాగంగా ఇవాళ ధర్మశాలలోని HPCA స్టేడియంలో రాత్రి 7.00 గంటలకు తొలి మ్యాచ్‌ జరగనుంది. అయితే మొన్న ప్రపంచకప్‌కు వచ్చిన అనుకోని అతిథి ఇక్కడ కూడా రాబోతున్నాడన్న భయం ఉంది. అదేనండి వర్షం.. మొన్న ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు వర్షం ఎఫెక్ట్‌తో చాలా మ్యాచ్‌లు రద్దయ్యాయి. అయితే సఫారీలతో జరుగుతున్న టీ20 సీరీస్‌ తొలి మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ముందస్తు జాగ్రత్తగా పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు.

వెస్టిండీస్ టూర్‌లో అన్ని ఫార్మాట్లలో టీమిండియా అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అన్ని మ్యాచులను గెలుచుకుంది. ఫలితంగా జట్టులో ఆత్మస్థైర్యం పెరిగింది. అయితే అదే సౌతాఫ్రికాను ఎదుర్కొవడం అనేది అంత ఈజీ కాదు. ప్రస్తుతం సీనియర్, జూనియర్ల కలయికతో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్‌తో 2020‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌‌కి సన్నద్ధతని ఆరంభించబోతోంది.

ప్రపంచకప్‌ను చేజార్చుకున్న టీమిండియా.. టీ20 ని మరోసారి చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. అందుకోసమే.. ఈ సీరీస్‌లో కొత్త ప్లేయర్లకు అవకాశం కల్పిస్తూ… ప్రయోగాలు చేస్తోంది. నవ్‌దీస్ సైని, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్‌, కృనాల్ పాండ్యాకి ఛాన్స్ ఇచ్చింది. బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలకు రెస్ట్ ఇచ్చింది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మతో పాటు జట్టులో కేఎల్ రాహుల్ ఉండగా, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలర్లు చెలరేగిపోతే… సఫారీ జట్టు మరో పరాజయం మూటకట్టుకోవాల్సిందే. అంతేగాక రికార్డుల పరంగా కూడా టీ20ల్లో సఫారీలపై భారత్‌దే పైచేయి. ఇప్పటి వరకు 13 టీ20ల్లో తలపడగా.. ఇందులో టీమిండియా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించిగా.. సౌత్ ఆఫ్రికా 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే.. టీమిండియా సొంత గడ్డపై ఇప్పటి వరకూ సౌత్ ఆఫ్రికాతో జరిగిన అన్ని టీ20 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.

టీమిండియా : విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవ్‌దీప్ సైని.

సౌత్ ఆఫ్రికా టీం : క్వింటన్ డికాక్ (కెప్టెన్), రస్సే వన్ డర్ డుస్సెన్ (వైస్ కెప్టెన్), టెంబ బవుమా, జూనియర్ దలా, బోర్న్ ఫార్టిన్, బ్యురన్ హెండ్రిక్స్, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జె, అండిలె ఫెహ్లుక్వాయో, డ్వేన్ పిట్రోరియస్, కగిసో రబద, తబ్రెయజ్ షంసి, జర్జ్ లిండె.

బంగారం, వెండితో పాటు భారీగా పెరుగుతున్న మరో మెటల్‌..!
బంగారం, వెండితో పాటు భారీగా పెరుగుతున్న మరో మెటల్‌..!
W,W,W,W,W,W,W,W.. టీ20 క్రికెట్‌లోనే ఊహించని విధ్వంసం
W,W,W,W,W,W,W,W.. టీ20 క్రికెట్‌లోనే ఊహించని విధ్వంసం
మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయిన బోగీలు!
మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయిన బోగీలు!
అందంగా లేదు అన్న హీరోయిన్‌తో హిట్ కొట్టిన వంశీ..
అందంగా లేదు అన్న హీరోయిన్‌తో హిట్ కొట్టిన వంశీ..
2026లో హోలీ రోజే చంద్రగ్రహణం.. వీరి జీవితంలో ఊహించని సమస్యలు!
2026లో హోలీ రోజే చంద్రగ్రహణం.. వీరి జీవితంలో ఊహించని సమస్యలు!
యూజీసీ నెట్‌ 2025 అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్ ఇదే
యూజీసీ నెట్‌ 2025 అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్ ఇదే
ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభకు కేసీఆర్.. ఆ తర్వాత..
ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభకు కేసీఆర్.. ఆ తర్వాత..
ఈ ఒక్క సైకాలజీ ట్రిక్‌తో మీ శత్రువులను మిత్రులుగా మార్చుకోండి!
ఈ ఒక్క సైకాలజీ ట్రిక్‌తో మీ శత్రువులను మిత్రులుగా మార్చుకోండి!
XUV 700లో లేనివి రాబోయే మహీంద్రా XUV 7XOలో అందించే టాప్‌ ఫీచర్స్‌
XUV 700లో లేనివి రాబోయే మహీంద్రా XUV 7XOలో అందించే టాప్‌ ఫీచర్స్‌
రాష్ట్రంపై వచ్చే 2 రోజులు చలి పంజా.. ఎల్లో అలర్ట్ జారీ!
రాష్ట్రంపై వచ్చే 2 రోజులు చలి పంజా.. ఎల్లో అలర్ట్ జారీ!