స్పోర్ట్స్‌లో ఇన్‌జూరీ కామన్.. ఎప్పుడు ఎలాంటి సమస్య వస్తుందో తెలవదు. కాని ముఖ్యమైన టోర్నమెంట్లలో ఆటగాళ్లకు గాయాలైతే మాత్రం ఆటపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వేళ ఫ్రాన్స్ జట్టును గాయాలు సతమతం చేస్తున్నాయి. ఆ జట్టు ఆటగాళ్లు ఫ్లూ సమస్యతో బాధపడుతున్నారు. వైరస్ ఉన్నప్పటికి ఆటగాళ్లు మొత్తం దోహలో ప్రాక్టీస్‌కు హాజరయ్యారు. ఫైనల్ మ్యాచ్ కావడంతో అనారోగ్య సమస్యలను సైతం పక్కన పెట్టి ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఫుట్‌బాల్‌లో ఆడుతున్న సమయంలోనే గాయాల పాలయ్యే అవకాశం ఎక్కువుగా ఉంటుంది. దీంతో ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో పాల్గొంటారు. గాయాలపాలైన ఆటగాళ్లు మాత్రం ప్రాక్టీస్‌కు దూరంగా ఉంటారు. కాని ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం అర్జెంటీనాతో జరగనున్న ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా ప్రాన్స్ ఆటగాళ్లు మొత్తం ప్రాక్టీస్‌కు హాజరయ్యారు. కోచ్ డిడియర్ డెస్చాంప్స్ నేతృత్వంలో వీరంతా ప్రాక్టీస్ చేశారు. వాస్తవానికి ప్రాన్స్ ఆటగాళ్లు చాలా మంది ఫిఫా వరల్డ్ కప్ సమయంలో ఫ్లూ బారిన పడ్డారు. కొంత మంది కీలక ఆటగాళ్లు సైతం గాయాల వల్ల కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
ఫ్రాన్స్ జట్టులోని మొత్తం 24 మంది ఆటగాళ్లు శనివారం సాయంత్రం దోహాలో ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఆటగాళ్లంతా శిక్షణలో పాల్గొన్నారని, వైరస్ నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నట్లు కోచ్ డెస్చాంప్స్ తెలిపారు. గాయాల పాలవ్వకుండా ఉంటే బాగుండేదని, అయినా తమ వైద్య సిబ్బంది సహాయంతో గాయాల ప్రమాదాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా, ఫ్రాన్స్ తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు తలో రెండు సార్లు ప్రపంచకప్‌ను గెల్చుకున్నాయి. మూడోసారి కప్‌ను గెలుచుకునేందుకు ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..