ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్ మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. అయితే ఓ నాలుగు జట్లు మాత్రం ఫేవరెట్స్ గా బరిలోకి దిగబోతున్నాయి. అన్ని జట్లు ప్రాక్టీస్ లో తలమునకలయ్యాయి. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ప్రాక్టీస్ సెషన్స్ పై కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. సాధారణంగా ఏ జట్టైనా అవతలి జట్టుతో తలపడే ముందు ఆజట్టు బలాలు, బలహీనతలు తెలుసుకుని వస్తాయి. ఏ బ్యాట్స్ మెన్ కు ఎలా బౌలింగ్ చేయాలో పూర్తి టెక్నిక్స్, కసరత్తుతో వస్తారు. కానీ బౌలర్ బౌలింగ్ వేసే సమయానికి రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ లెఫ్ట్ హ్యాండర్ గా మారితే బౌలర్ కు ఒక్కసారిగా దిమ్మతిరుగుతుంది. ఒక్కసారిగా ఎలాంటి బాల్ వేయాలో కూడా అర్థంకాదు. కన్ఫ్యూజన్ లో లీగల్ డెలివరీ వేయడం కూడా కష్టమే. అదే జోస్ బట్లర్ వంటి బ్యాట్స్ మెన్ కు మాములుగా బౌలింగ్ వేయడమే పెద్ద కష్టం. గ్రౌండ్ లో సెటిల్ అయ్యారంటే బౌలర్ ఎవరని చూడకుండా.. వీర బాదుడే.. బాదుడు.. అందుకే కొంతమంది బ్యాట్స్ మెన్లను త్వరగా పెవిలియన్ పంపించేందుకు బౌలింగ్ టీమ్ ప్లాన్ చేస్తుంది. టీ20 ప్రపంచకప్ కు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో జోస్ బట్లర్ ప్రాక్టీస్ సెషన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెట్స్ లో బెన్ స్టోక్స్ బౌలింగ్ లో లెప్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేశాడు జోస్ బట్లర్.
టీ20 ప్రపంచకప్ లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లు అక్టోబర్ 16వ తేదీన ప్రారంభం కానుండగా, సూపర్ 12 మ్యాచ్ లు అక్టోబర్ 22వ తేదీ నుంచి ప్రారంభంమవుతాయి. టీ20 ప్రపంచకప్ కోసం అగ్రశ్రేణి క్రికెట్ జట్లన్నీ సిద్ధం అవుతున్నాయి. టైటిల్ కోసం ముందున్న జట్లలో ఇంగ్లాండ్ కూడా ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న జోస్ బట్లర్ నేతృత్వంలోని జట్టు అక్టోబర్ 9వ తేదీన జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టును ఎనిమిది పరుగుల తేడాతో ఓడించింది. రెండో మ్యాచ్ లో ఈ రెండు జట్లు అక్టోబర్ 12వ తేదీ బుధవారం తలపడుతున్నాయి. గాయం నుంచి కోలుకుని టీ 20 ప్రపంచ కప్ కోసం సిద్ధమవుతున్నాడు జోస్ బట్లర్. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ లోనూ ఆఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
బట్లర్ కేవలం 32 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. T20 ప్రపంచ కప్ కు ముందు బట్లర్ ఫామ్‌లోకి రావడం ఇంగ్లాండ్ కు కలిసొచ్చే అంశమే. మంచి ఫామ్ లో కనిపిస్తున్న ఈ ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ ఇటీవలి ప్రాక్టీస్ సెషన్‌లో బెన్ స్టోక్స్ బౌలింగ్ వేసినప్పుడు ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపర్చాడు. అవసరమైతే బౌలింగ్ ను బట్టి ఎలాగైనా బ్యాటింగ్ చేయడానికి తాను ముందునుంచే ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేయకపోయినా, బాల్స్ ను బట్టి లెఫ్ట్ హ్యాండ్ గా మారడానికి బట్లర్ ఇలా ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ben Stokes bowls to England left-handed opener Jos Buttler. ? #AUSvENG pic.twitter.com/NLtmRDINdh
— Melinda Farrell (@melindafarrell) October 11, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..