కోచ్ ఎంపికలో కోహ్లీ ప్రమేయం ఉండదు – బీసీసీఐ

వరల్డ్‌కప్‌లో టీమిండియా సెమీస్‌తోనే నిష్క్రమించడంతో.. బీసీసీఐ ప్రక్షాళన మొదలుపెట్టింది. హెడ్ కోచ్ నుంచి మిగిలిన అన్ని పోస్ట్‌లకు బీసీసీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులను జూలై 30 వరకు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ హెడ్ కోచ్ ఎంపికలో మాత్రం కెప్టెన్ విరాట్ కోహ్లీ పాత్ర ఇకపై ఏమాత్రం ఉండబోదని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఒకప్పుడు కోచ్ ఎంపిక విషయంలో కోహ్లీ మద్దతు తీసుకున్నా.. ఇప్పుడు అలా ఉండదని అంటున్నారు. ప్రధాన […]

కోచ్ ఎంపికలో కోహ్లీ ప్రమేయం ఉండదు - బీసీసీఐ
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 18, 2019 | 9:19 PM

వరల్డ్‌కప్‌లో టీమిండియా సెమీస్‌తోనే నిష్క్రమించడంతో.. బీసీసీఐ ప్రక్షాళన మొదలుపెట్టింది. హెడ్ కోచ్ నుంచి మిగిలిన అన్ని పోస్ట్‌లకు బీసీసీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులను జూలై 30 వరకు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ హెడ్ కోచ్ ఎంపికలో మాత్రం కెప్టెన్ విరాట్ కోహ్లీ పాత్ర ఇకపై ఏమాత్రం ఉండబోదని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఒకప్పుడు కోచ్ ఎంపిక విషయంలో కోహ్లీ మద్దతు తీసుకున్నా.. ఇప్పుడు అలా ఉండదని అంటున్నారు. ప్రధాన కోచ్ ఎంపికని సీఐఏ తమ పర్యవేక్షణలో అడ్‌హక్ కమీటీకి అప్పగించిందని పేర్కొన్నారు.