విండీస్ టూర్‌కు టీమిండియా ఎంపిక వాయిదా?

వచ్చే నెలలో విండీస్ టూర్‌కు వెళ్లనున్న భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ఎంపిక చేయాల్సి ఉంది. కానీ రేపు జట్టు ఎంపికకు సంబంధించిన సమావేశం జరిగే అవకాశం లేదని తెలుస్తుంది. శనివారం లేదా ఆదివారం సెలక్షన్‌ కమిటీ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో జట్టు ఎంపిక జరగవచ్చు. సెమీస్‌లో ఓడి ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన తర్వాత టీమిండియాకు ఇదే తొలి సిరీస్‌. దీంతో వెస్టిండీస్‌ సిరీస్ కోసం ఎంపికయ్యే భారత జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వికెట్‌ కీపర్‌ […]

విండీస్ టూర్‌కు టీమిండియా ఎంపిక వాయిదా?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 19, 2019 | 1:15 AM

వచ్చే నెలలో విండీస్ టూర్‌కు వెళ్లనున్న భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ఎంపిక చేయాల్సి ఉంది. కానీ రేపు జట్టు ఎంపికకు సంబంధించిన సమావేశం జరిగే అవకాశం లేదని తెలుస్తుంది. శనివారం లేదా ఆదివారం సెలక్షన్‌ కమిటీ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో జట్టు ఎంపిక జరగవచ్చు. సెమీస్‌లో ఓడి ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన తర్వాత టీమిండియాకు ఇదే తొలి సిరీస్‌. దీంతో వెస్టిండీస్‌ సిరీస్ కోసం ఎంపికయ్యే భారత జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వికెట్‌ కీపర్‌ ధోనీ విండీస్ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదో అనే సమాచారం లేదు. ప్రపంచకప్ సెమీస్‌లో భారత జట్టు ఓటమి పాలైన తర్వాత కోహ్లీ ఈ రోజు (గురువారం) భార్య అనుష్కతో కలిసి ముంబై చేరుకున్నాడు. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌లు భారత్‌ తలపడనుంది.