ఆ రికార్డులకు అతి చేరువలో విరాట్ కోహ్లీ!

| Edited By:

Aug 21, 2019 | 7:50 AM

రికార్డుల రారాజు కోహ్లీ… కెప్టెన్సీలో మరో రికార్డుకు చేరువయ్యాడు. టెస్టుల్లో భారత్‌కు అత్యధిక విజయాలు సాధించిపెట్టిన మహేంద్రసింగ్‌ ధోని (60 మ్యాచ్‌ల్లో 27) రికార్డుకు కోహ్లి (46 మ్యాచ్‌ల్లో 26) అతి సమీపంగా ఉన్నాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో భారత్‌ గెలిస్తే.. విరాట్‌.. మహిని సమం చేస్తాడు. ఈ జాబితాలో సౌరభ్‌ గంగూలీ (49 మ్యాచ్‌ల్లో 21) మూడో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో విజయవంతమైన కెప్టెన్లలో గ్రేమ్‌ స్మిత్‌ (దక్షిణాఫ్రికా, 109 మ్యాచ్‌ల్లో 53 విజయాలు) […]

ఆ రికార్డులకు అతి చేరువలో విరాట్ కోహ్లీ!
Follow us on

రికార్డుల రారాజు కోహ్లీ… కెప్టెన్సీలో మరో రికార్డుకు చేరువయ్యాడు. టెస్టుల్లో భారత్‌కు అత్యధిక విజయాలు సాధించిపెట్టిన మహేంద్రసింగ్‌ ధోని (60 మ్యాచ్‌ల్లో 27) రికార్డుకు కోహ్లి (46 మ్యాచ్‌ల్లో 26) అతి సమీపంగా ఉన్నాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో భారత్‌ గెలిస్తే.. విరాట్‌.. మహిని సమం చేస్తాడు. ఈ జాబితాలో సౌరభ్‌ గంగూలీ (49 మ్యాచ్‌ల్లో 21) మూడో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో విజయవంతమైన కెప్టెన్లలో గ్రేమ్‌ స్మిత్‌ (దక్షిణాఫ్రికా, 109 మ్యాచ్‌ల్లో 53 విజయాలు) ముందున్నాడు.

వెస్టిండీస్‌తో తొలి టెస్టులో కోహ్లి కోసం మరో రికార్డు వేచి చూస్తోంది. కెప్టెన్‌ అయ్యాక ఈ ఫార్మాట్లో ఇప్పటికే 18 సెంచరీలు సాధించిన విరాట్‌.. తొలి టెస్టులో శతకం సాధిస్తే 19 సెంచరీలతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న పాంటింగ్‌ను అందుకోనున్నాడు. కెప్టెన్‌గా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌లో గ్రేమ్‌ స్మిత్‌ (25) అగ్రస్థానంలో ఉన్నాడు.

టెస్టు క్రికెట్లో పోటీ ఇప్పుడు రెట్టింపు అయిందని భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం వెస్టిండీస్‌తో తొలి టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో విరాట్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్రస్తుతం టెస్టు క్రికెట్లో పోటీ మరింత పెరిగింది. దీంతో టెస్టులకు కూడా ప్రయోజనం చేకూరుతోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ సరైన సమయంలో జరుగుతోంది. టెస్టు క్రికెట్‌ ప్రభావం తగ్గుతుందని కొందరు భావిస్తున్నారు. నా దృష్టిలో గత రెండేళ్లలో సుదీర్ఘ ఫార్మాట్‌లో పోటీ బాగా పెరిగింది’’ అని విరాట్‌ చెప్పాడు.