పట్టుబిగించిన భారత్.. 260 పరుగుల భారీ ఆధిక్యం!

|

Aug 25, 2019 | 8:46 AM

ఆంటీగ్వా: విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో కోహ్లీసేన భారీ ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత బౌలర్లలో ఇషాంత్‌శర్మ (5/43), షమి(2/48), జడేజా(2/64)లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. 75 పరుగుల లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 72 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(51*), అజింక్య రహానే(53*)లు క్రీజులో ఉన్నారు. ఇకపోతే మయాంక్(16), […]

పట్టుబిగించిన భారత్.. 260 పరుగుల భారీ ఆధిక్యం!
Follow us on

ఆంటీగ్వా: విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో కోహ్లీసేన భారీ ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత బౌలర్లలో ఇషాంత్‌శర్మ (5/43), షమి(2/48), జడేజా(2/64)లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. 75 పరుగుల లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 72 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(51*), అజింక్య రహానే(53*)లు క్రీజులో ఉన్నారు. ఇకపోతే మయాంక్(16), రాహుల్(38). పుజారా(25)లు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. అయితే ఇంకా భారత్ చేతిలో 7 వికెట్లు ఉండటంతో.. ఇప్పటికే 260 పరుగుల ఆధిక్యం లభించడంతో.. తొలి టెస్ట్‌లో టీమిండియా పైచేయి సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు.