Paris Olympics 2024: ఫోగట్‌కు నిరాశ.. ఫోగట్‌ అప్పీల్‌ను తిరస్కరించిన కాస్

|

Aug 14, 2024 | 10:00 PM

అయితే, ఈ కేసులో అంతకుముందు ఈ కేసులో మంగళవారం అంటే ఆగస్టు 16న CAS తన తీర్పును ఇవ్వనున్నట్టుగా తెలిపింది. కానీ, బుధవారం సాయంత్రానికి తీర్పు వెల్లడి కావడంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW), ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC)కి వ్యతిరేకంగా ఫోగాట్ దరఖాస్తును కొట్టివేస్తూ CAS వద్ద ఏకైక మధ్యవర్తి నిర్ణయం పట్ల IOA అధ్యక్షురాలు డాక్టర్ PT ఉష తన దిగ్భ్రాంతిని, నిరాశను వ్యక్తం చేశారు.

Paris Olympics 2024: ఫోగట్‌కు నిరాశ.. ఫోగట్‌ అప్పీల్‌ను తిరస్కరించిన కాస్
Vinesh Phogat
Follow us on

పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హతకు వ్యతిరేకంగా వినేష్ ఫోగట్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సిఎఎస్) బుధవారం కొట్టివేసింది. రజత పతకం కోసం వినేష్ ఫోగట్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించినట్లు రెవ్‌స్పోర్ట్జ్ బుధవారం నివేదించింది. 100 గ్రాముల అధిక బరువుతో ఫోగట్‌పై అనర్హత వేటు పడింది. రజత పతకం కోసం కాస్‌ను ఆశ్రయించిన ఫోగట్‌కు ఇటు భారతీయ క్రీడా అభిమానులకు చివరకు నిరాశే మిగిలింది. ప్యారిస్‌లో జరిగిన మహిళల 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో స్వర్ణ పతకాన్ని ఖాయం చేసేందుకు వెళ్లిన USA క్రీడాకారిణి సారా హిల్డెబ్రాండ్‌తో జరిగిన ఫైనల్ బౌట్‌కి కొన్ని గంటల ముందు వినేష్ అనర్హురాలిగా ఆటకు దూరం కావాల్సి వచ్చింది.

పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు వ్యతిరేకంగా వినేష్ ఫోగట్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సిఎఎస్) కొట్టివేసింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఎ) ఈ మేరకు బుధవారం ధృవీకరించింది. అయితే, ఈ కేసులో అంతకుముందు ఈ కేసులో మంగళవారం అంటే ఆగస్టు 16న CAS తన తీర్పును ఇవ్వనున్నట్టుగా తెలిపింది. కానీ, బుధవారం సాయంత్రానికి తీర్పు వెల్లడి కావడంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW), ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC)కి వ్యతిరేకంగా ఫోగాట్ దరఖాస్తును కొట్టివేస్తూ CAS వద్ద ఏకైక మధ్యవర్తి నిర్ణయం పట్ల IOA అధ్యక్షురాలు డాక్టర్ PT ఉష తన దిగ్భ్రాంతిని, నిరాశను వ్యక్తం చేశారు.

తన బంగారు పతక పోరుకు కొద్ది క్షణాల ముందు గేమ్‌ రూల్స్‌ ప్రకారం ఉండాల్సి పరిమితి కంటే 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నందుకు భారత రెస్టర్ IOC చేత అనర్హత వేటు వేసింది.

ఇవి కూడా చదవండి

ఒలింపిక్స్ అనర్హతను సవాలు చేస్తూ ఫోగట్ ఆగస్టు 7న ఆమె అప్పీల్‌ను దాఖలు చేసింది. దీనితో ఒలింపిక్స్ కమిటీ ఆమె రజత పతక విజయాన్ని రద్దు చేసింది. తన అప్పీల్‌లో ఫైనల్‌కు ఒక రోజు ముందు తన బౌట్‌లలో నిర్దేశించిన బరువు పరిమితిలో ఉన్నందున లోపెజ్‌తో కలిసి తనకు ఉమ్మడి రజతం ఇవ్వాలని డిమాండ్ చేసింది.