Rafael Nadal: ప్రమాదవశాత్తూ ముక్కుకు తగిలిన టెన్నిస్ రాకెట్‌.. బాధతో విలవిల్లాడిపోయిన స్పెయిన్‌ బుల్‌

US Open 2022: స్పెయిన్‌కు చెందిన ప్రముఖ టెన్నిస్ ఆటగాడు రఫేల్‌ నాదల్‌ (Rafael Nadal) గాయపడ్డాడు. రిటర్న్‌ షాట్‌ కొట్టే సందర్భంలో తన రాకెట్‌ ముక్కుకు బలంగా తాకడంతో కోర్టులోనే బాధతో విలవిల్లాడిపోయాడు.

Rafael Nadal: ప్రమాదవశాత్తూ ముక్కుకు తగిలిన టెన్నిస్ రాకెట్‌.. బాధతో విలవిల్లాడిపోయిన స్పెయిన్‌ బుల్‌
Rafael Nadal

Updated on: Sep 02, 2022 | 6:04 PM

US Open 2022: స్పెయిన్‌కు చెందిన ప్రముఖ టెన్నిస్ ఆటగాడు రఫేల్‌ నాదల్‌ (Rafael Nadal) గాయపడ్డాడు. రిటర్న్‌ షాట్‌ కొట్టే సందర్భంలో తన రాకెట్‌ ముక్కుకు బలంగా తాకడంతో కోర్టులోనే బాధతో విలవిల్లాడిపోయాడు. ముక్కు నుంచి రక్తం కూడా రావడంతో కాసేపు బ్రేక్‌ తీసుకోవాల్సి వచ్చింది. యూఎస్‌ ఓపెన్‌ రెండో రౌండ్‌లో భాగంగా ఇటలీ ఆటగాడు ఫాబియో ఫోగ్నినితో నాదల్‌ తలపడిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో మెడికల్‌ బ్రేక్‌ సమయంలో ప్రాథమిక చికిత్స చేయించుకుని కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఆతర్వాత బరిలోకి దిగి ప్రత్యర్థిపై విజయం సాధించాడు.

గట్టి పోటినిచ్చిన ఫోగ్నిని..
కాగా ఈ మ్యాచ్‌లో ఫోగ్నిని నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నాడు నాదల్‌. తొలి సెట్‌ను 2-6 తేడాతో కోల్పోయాడు. అయితే ఆతర్వాత అసలైన ఆటతీరును ప్రదర్శించాడు. వరుసగా రెండు సెట్ల (6-4, 6-2)ను కైవసం చేసుకున్నాడు. నిర్ణయాత్మకమైన నాలుగో సెట్లో‌నూ తన దూకుడును కొనసాగించాడు. ఈక్రమంలోనే షాట్‌ కొట్టేందుకు ప్రయత్నించగా.. నేతలకు తగిలిన రాకెట్‌ బౌన్స్ అయ్యి వేగంగా అతని ముక్కును తాకింది. దీంతో రాకెట్‌ను పక్కన పడేసి నేలపై పడుకునిపోయాడు. ముక్కు నుంచి కాస్త రక్తం రావడంతో ప్రాథమిక వైద్యం అందించారు. కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఆతర్వాత మళ్లీ బరిలోకి దిగి 6-1 తేడాతో నాలుగో సెట్‌తో పాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..