India Vs Australia 2020: భారత్-ఆస్ట్రేలియా రెండవ టెస్ట్ మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్ జట్టు..
మెలోబోర్న్ క్రీడా మైదానం వేదికగా భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన కంగారూలు బ్యాటింగ్..

India Vs Australia 2020: మెలోబోర్న్ క్రీడా మైదానం వేదికగా భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన కంగారూలు బ్యాటింగ్ ఎంచుకున్నారు. తొలి టెస్ట్‌లో ఘన విజయం సాధించిన ఆసిస్ ప్లేయర్లు మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక తొలి టెస్ట్‌లో ఘోర పరాజయాన్ని చవి చూసిన టీమిండియా.. భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. పితృత్వ సెలవులపై టీమిండియా సారథి కోహ్లీ ఇండియాకు పయనమైన విషయం తెలిసిందే. ఇక గాయం కారణంగా పేసర్ షమీ కూడా ఈ మ్యాచ్‌కు దూరయ్యాడు. మరోవైపు రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ జట్టులో చోటు దక్కించుకున్నారు. మొత్తంగా టీమిండియా కొత్త జట్టుతో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే తాత్కాలిక కెప్టెన్ అజింక్యా రహానే పేరు మారిమోగిపోవడం ఖాయమనే చెప్పాలి.
Also read:
Corona vaccine: భారత్ టీకాపై ప్రపంచ దేశాల దృష్టి.. ఆశాజనకంగా వస్తున్న వ్యాక్సిన్ ఫలితాలు..
టాలీవుడ్ లో రాణించాలని చూస్తున్న అందాల భామ.. శశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సురభి




