India Vs Australia 2020: మూడో వికెట్ కోల్పోయిన ఆసిస్ జట్టు.. టెస్టుల్లో మొదటి సారి డకౌట్ అయిన స్మిత్…
ఆసిస్‌కు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు పది పరుగులు వద్ద ఉన్న సమయంలో మొదటి వికెట్‌గా జో బర్న్స్ ఔట్ అయ్యాడు.

మెల్‌బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన కంగారూలు బ్యాటింగ్ ఎంచుకున్నారు. అయితే ఆసిస్‌కు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు పది పరుగులు వద్ద ఉన్న సమయంలో మొదటి వికెట్‌గా జో బర్న్స్ ఔట్ అయ్యాడు. ఇక రెండో వికెట్‌గా వేడ్ వెనుదిరిగాడు. అతడిని 13వ ఓవర్లో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఔట్ చేశాడు.
టెస్టుల్లో మొదటిసారి డకౌట్ అయిన స్టీవ్ స్మిత్…
ఆసిస్ స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ మొదటి సారి టెస్టుల్లో డకౌట్ అయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఎనమిది బాల్స్ ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండానే స్మిత్ ఔట్ అయ్యాడు. దీంతో ఆసిస్ 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.



