T20 World cup: ఇక ఆ ఇంగ్లిష్‌ అంపైర్‌ ప్రపంచకప్‌లో కనిపించరు.. ఎందుకంటే..

తంలో బెస్ట్‌ అంపైర్‌ పురస్కారం అందుకున్న ప్రముఖ ఇంగ్లిష్‌ అంపైర్‌ మైఖెల్‌ గాఫ్‌ ఇక ఈ టీ 20 ప్రపంచకప్‌లో కనిపించరు. టీ 20 వరల్డ్‌ కప్‌ విధుల నుంచి అతనిని తొలగిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

T20 World cup: ఇక ఆ ఇంగ్లిష్‌ అంపైర్‌ ప్రపంచకప్‌లో కనిపించరు.. ఎందుకంటే..

Edited By: Anil kumar poka

Updated on: Nov 05, 2021 | 11:10 AM

గతంలో బెస్ట్‌ అంపైర్‌ పురస్కారం అందుకున్న ప్రముఖ ఇంగ్లిష్‌ అంపైర్‌ మైఖెల్‌ గాఫ్‌ ఇక ఈ టీ 20 ప్రపంచకప్‌లో కనిపించరు. టీ 20 వరల్డ్‌ కప్‌ విధుల నుంచి అతనిని తొలగిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. గాఫ్‌ బయోబబుల్‌ నిబంధనలు అతిక్రమించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇందుకు గాను మొదట అతనికి ఆరు రోజుల కఠిన క్వారంటైన్‌ విధించింది ఐసీసీ. ఇది పూర్తయ్యాక మళ్లీ అంపైరింగ్‌ బాధ్యతలు స్వీకరిస్తారని అందరూ భావించారు. అయితే ఏకంగా అతనని టీ 20 ప్రపంచకప్‌ బాధ్యతల నుంచి తొలగిస్తూ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది ఐసీసీ.

గత ఆదివారం (అక్టోబర్‌ 31) జరిగిన భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు గాఫ్‌ నే అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. అయితే రెండు రోజుల ముందే (అక్టోబర్‌28)న అతను బయోబబుల్‌ నిబంధనలను అతిక్రమించి తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఐసీసీ అతనిని అంపైరింగ్‌ విధుల నుంచి తప్పించి ఆరు రోజుల క్వారంటైన్‌కు పంపింది. నవంబర్‌ 3తో ఆయన క్వారంటైన్‌ ముగసింది. గురువారం (నవంబర్‌4) శ్రీలంక, వెస్టిండీస్‌ మ్యాచ్‌కు గాఫ్‌నే అంపైరింగ్‌ విధులు నిర్వర్తించాల్సి ఉంది. అయితే అంతుకుముందే ఆయనను ప్రపంచకప్ విధుల నుంచి తొలగించింది.

Also Read:

IND vs AFG Match Result: టీమిండియా ఘన విజయం.. అర్థ సెంచరీలతో రాణించిన రోహిత్, రాహుల్.. 66 పరుగుల తేడాతో ఆఫ్ఘన్ ఓటమి

T20 World Cup 2021: టోర్నీ నుంచి టీమిండియా ‘మిస్టరీ స్పిన్నర్’ ఔట్.. ఎందుకో తెలుసా?

T20 World Cup 2021, IND vs AFG: డూ ఆర్ డై మ్యాచులో అశ్విన్‌కు అవకాశం.. 1577 రోజుల తర్వాత వచ్చిన ఛాన్స్..!