Tokyo Olympics 2021: త్వరలో ఒలింపిక్స్.. అడ్డంగా బుక్కైన భారత అథ్లెట్లు.. డోపింగ్ టెస్ట్‌లో పాజిటివ్..

|

Mar 15, 2021 | 12:55 PM

Tokyo Olympics 2021: జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్ గేమ్స్ జులైలో ప్రారంభం కానున్నాయి. ఈ గేమ్స్‌లో భారత్ తరఫున చాలా..

Tokyo Olympics 2021: త్వరలో ఒలింపిక్స్.. అడ్డంగా బుక్కైన భారత అథ్లెట్లు.. డోపింగ్ టెస్ట్‌లో పాజిటివ్..
Summer Olympics 2020
Follow us on

Tokyo Olympics 2021: జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్ గేమ్స్ జులైలో ప్రారంభం కానున్నాయి. ఈ గేమ్స్‌లో భారత్ తరఫున చాలా మంది అథ్లెట్లు, ఇతర క్రీడాకారులు ప్రాథినిథ్యం వహించనున్నారు. అయితే, తాజాగా టోక్కో ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించనున్న ఇద్దరు అథ్లెట్లు డోపింగ్ టెస్ట్‌లో అడ్డంగా బుక్కయ్యారు. జులైలో ప్రారంభం కానున్న టోక్కో ఒలింపిక్స్ కోసం భారత అథ్లె్ట్లకు ఇండియన్ గ్రాండ్ ప్రి మీట్‌లో డోపింగ్ టెస్టులు నిర్వహించారు.

ఈ టెస్టులో ఇద్దరు అథ్లెట్లు దోషులుగా తేలారు. ఇదే విషయాన్ని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) డైరెక్ట్ జనరల్ నవీన్ వెల్లడించారు. డోపింగ్‌లో తేలిన అథ్లెట్లు ఇచ్చిన శాంపిల్స్‌లో మిథైల్ హైక్సాన్-2 అమైన్ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉందని గుర్తించినట్లు ఆయన తెలిపారు. డోపింగ్‌లో పట్టుబడిన ఈ ఇద్దరు అథ్లెట్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇక వీరిని త్వరలోనే ‘నాడా’ క్రమశిక్షణా ప్యానెల్(ఏడీడీపీ) విచారిస్తుందని, విచారణలో దోషులుగా తేలినట్లయితే నిబంధనల ప్రకారం వారిపై వేటు పడుతుందని చెప్పారు. ఇదిలాఉంటే.. డోపింగ్ టెస్ట్‌లో దొరికిన అథ్లెట్ల వివరాలను మాత్రం ‘నాడా’ వెల్లడించలేదు.

గతేడాది జరగాల్సిన ఒలింపిక్స్.. కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం(ఐఒసి) సమ్మర్ ఒలింపిక్స్‌ని నిర్వహిస్తోంది. ఈ ఒలింపక్ గేమ్స్ జపాన్ రాజధాని టోక్యో వేదికగా జులై 23వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు జరుగనున్నాయి. జపాన్ నేషనల్ స్టేడియంలో జరిగే ఈ ఈవెంట్‌లో మొత్తం 33 గేమ్స్‌లలో 339 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇక ఈ ఒలింపిక్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా 206 దేశాలకు చెందిన.. 11,091 మంది అథ్లెట్లు, క్రీడాకార్లు పాల్గొననున్నారు.

Also read: Telangana Budget Highlights: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు.. తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది: గవర్నర్‌ తమిళిసై ‌

Mydukur Mayor: మైదుకూరు జనం ఎవరిని ఓడించారు..? ఎవరి గెలిపించారు..? మరి పీఠం ఎక్కేది ఎవరు..?