Tokyo Olympics 2021: భారత రెజ్లర్ రవిని గట్టిగా కొరికిన కజకిస్తాన్ ఆటగాడు.. క్రీడాస్ఫూర్తి విరుద్ధమంటూ సెహ్వాగ్ మండిపాటు

|

Aug 05, 2021 | 3:27 PM

Tokyo Olympics 2021: ఒకరి గెలుపు.. మరోకరి ఓటమి ఇదే ఆటల యొక్క తీరు.. గెలిచినవారు హుందాగా ఉంటూ.. ఓడిన ప్రత్యర్థులను గౌరవించాలి.. అదే విధంగా ఓడిన ప్రత్యర్థి సహనం కోల్పోకుండా ఉక్రోషం చూపించకుండా విజేత విషయంలో..

Tokyo Olympics 2021: భారత రెజ్లర్ రవిని గట్టిగా కొరికిన కజకిస్తాన్ ఆటగాడు.. క్రీడాస్ఫూర్తి విరుద్ధమంటూ సెహ్వాగ్ మండిపాటు
Ravi Dahiya
Follow us on

Tokyo Olympics 2021: ఒకరి గెలుపు.. మరోకరి ఓటమి ఇదే ఆటల యొక్క తీరు.. గెలిచినవారు హుందాగా ఉంటూ.. ఓడిన ప్రత్యర్థులను గౌరవించాలి.. అదే విధంగా ఓడిన ప్రత్యర్థి సహనం కోల్పోకుండా ఉక్రోషం చూపించకుండా విజేత విషయంలో హుందాగా వ్యవహరించాలి. అయితే కొక్కసారి పోటీల్లో ప్రత్యర్ధుల చేతుల్లో ఓడిపోతున్నామని తెలిసిన వెంటనే కొందరు ఆటగాళ్ళు .. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. వార్తల్లో నిలుస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ స్టార్ రెజ్లర్ రవి దహియా ప్రత్యర్థి నురిస్లామ్ సనయొవ్ తో తలపడి పురుషుల 57 కేజీల కేటగిరీ సెమీస్‌లో నాలుగో సీడ్ రవి ‘విక్టరీ బై ఫాల్’ పద్దతిలో విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టాడు. అయితే రవి గెలుపుని ముందే గుర్తించిన ప్రత్యర్థి నురిస్లామ్ ఆట చివరిలో రవి ని గట్టిగా కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బౌట్ ఫస్ట్ 30 సెకన్లలో రవికి పట్టు దొరక్కపోవడంతో 0-1తో వెనుకబడ్డాడు.అయితే రవి సూపర్ స్టామినాతో , అద్భుతమైన టెక్నీతో ప్రత్యర్థి పై పట్టు సాధించడానికి అటాకింగ్ కు దిగాడు. చాలా లీడ్ లో ఇక రవి ఒలింపిక్స్లో పోరాటం దాదాపు ముసిగింది అని అందరూ భావిస్తున్న సమయంలో రవి సంచలనం సృష్టించాడు. చివరిలో నురిస్లామ్ రెండు కాళ్లను బలంగా అదిమి కొన్ని సెకన్ల పాటు మ్యాట్‌పై ప్రత్యర్థిని కదలకుండా చేసి చిరస్మరణీయ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

.అయితే ఇలా రవి పట్టి పిన్ డౌన్ చేస్తున్న సమయంలో సనయెవ్.. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు తెలుస్తోంది. రవి నుంచి తప్పించుకునేందుకు ప్రత్యర్థి గట్టిగా కొరికాడు. ఆ బాధని భరిస్తూ రవ ప్రత్యర్థిపై పట్టు మాత్రం వీడలేదు. బౌట్ ముగిసిన అనంతరం ప్రత్యర్థి పంటి గాట్లను రిఫరీకి చూపించాడు. నురిస్లామ్ సనయేవ్ తీరుపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ మండిపడ్డాడు.

కజకిస్థాన్ ప్లేయర్ క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యహరించాడని సెహ్వాగ్ ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించాడు. ఇది మరీ దారుణం. కసితీరా కొరికినా రవి దహియా విజయాన్ని ఆపలేకపోయాడు. కజకిస్థాన్ ప్లేయర్ ప్రవర్తించిన తీరు కరెక్ట్ కాదు అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. పంటి గాయాలకు సంబంధించిన ఫొటోలు షేర్ చేశాడు. ఇక సనయోవ్ తీరుపై క్రీడాభిమానులు కూడా ఖండిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నిరసన తెలుపుతున్నారు.

Also Read: Ancient Shiva Linga: క్రైస్తవులతో మహామానిత్వ దేవుడిగా పూజలందుకుంటున్న శివలింగం.. ఏ దేశంలో నంటే..