Tokyo Olympics 2021: మరో మూడు రోజుల్లో టోక్యో ఒలింపిక్స్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈమేరకు పలు దేశాల ఆటగాళ్లు ఒలింపిక్ క్రీడా గ్రామం చేరుకుంటున్నారు. ఈ నేపత్యంలో అక్కడ ఏర్పాటు చేసిన బెడ్స్‌పై పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వీటిపై స్పందించిన నిర్వాహకులు ఆ వార్తలున్నీ అవాస్తవమని తేల్చి చెప్పారు. కేవలం పర్యావరణ హితంగా కార్డ్ బోర్డ ఉపయోగించి వీటిని తయారు చేశామని పేర్కొన్నారు. కాగా, ఒలింపిక్ విలేజ్‌లోని బెడ్స్ ఉత్తవేని, త్వరగా విరిగిపోతాయని, అలాగే అథ్లెట్లు శారీరకంగా కలవకుండా ఏర్పాటు చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, బెడ్స్ పటిష్టతను ఐరిష్ జిమ్నాస్ట్ మెక్ క్లెంగన్ నిరూపించాడు. ఈమేరకు బెడ్‌పై నుంచి పదేపదే దూకుతూ ఓ వీడియోను షూట్ చేశాడు. ఈ బెడ్స్ చాలా బలంగా ఉన్నాయంటూ తేల్చి చెప్పాడు. దీంతో ఈ వీడియోను ఐఓసీ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ‘బెడ్స్ కార్డ్‌బోర్డ్‌తో తయారుచేసినవే. చాలా బలంగా కూడా ఉన్నాయి. అథ్లెట్లు శారీరకంగా కలవకుండా ఈ బెడ్స్ ఏర్పాటు చేశారనే వార్తల్లో నిజం లేదని తేలిపోయిందని’ ట్విట్టర్లో పేర్కొంది. అలాగే ఐరిష్ జిమ్నాస్ట్ మెక్‌లాంగన్‌కు ధన్యవాదాలు తెలియజేసింది.
మరోవైపు ఈ బెడ్స్‌పై సందేహాలు రావడం ఇదేం మొదటిసారి కాదు. జనవరిలో ఆస్ట్రేలియా బాస్కెట్‌బాల్ ఆటగాడు ఆండ్రూ బోగట్ వీటి పటిష్టతపై అనుమానాలు వ్యక్తం చేశాడు. దీనికి ఎయిర్ వేవ్ సంస్థ స్పందించి.. 200 కిలోల బరువును తట్టుకోగలవని సమాధానం ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. అలాగే క్రీడా గ్రామంలోకి అథ్లెట్లు ఎంటర్ అయ్యాక నిన్నటి నుంచి ఈ బెడ్స్‌పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఇలాంటి వార్తలన్నీ నిరాధారమని వెల్లడైంది.
ఒలింపిక్స్ కోసం భారత అథ్లెట్ల తొలి విడతగా ఆర్చరీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, జూడో, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌కు చెందిన 88 సభ్యుల బృందంలో 54 మంది అథ్లెట్లతో పాటు సహాయ సిబ్బంది, ఐఓఏ ప్రతినిధి వెళ్లారు. ఇక తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు పీవీ సింధు, సాయి ప్రణీత్, సాత్విక్ సాయిరాజ్ కూడా శనివారం టోక్యో వెళ్లిన వారిలో ఉన్నారు. ఈ ఒలింపిక్స్‌కు భారత్ మొత్తం 228 సభ్యులను పంపిస్తోంది. ఇందులో 119 మంది అథ్లెట్లు ఉన్నారు. భారత రోయింగ్, షూటింగ్ జట్లు ఇప్పటికే టోక్యో చేరుకున్న సంగతి తెలిసిందే. ఇటలీ నుంచి బయల్దేరిన బాక్సింగ్ బృందం ఆదివారం చేరుకుంది. భారత్ నుంచి నలుగురు సెయిలర్లతో కూడిన బృందం టోక్యోలో అడుగుపెట్టింది. గురువారమే సెయిలర్లు టోక్యో చేరుకున్నారు. అథ్లెట్లకు క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, ఐఓఏ ప్రెసిడెంట్ నరీందర్ బాత్రా, సెక్రటరీ రాజీవ్ మోహతా, సాయ్ డైరెక్టర్ సందీప్ ప్రధాన్ సెండాఫ్ ఇచ్చిన వారిలో ఉన్నారు.
“Anti-sex” beds at the Olympics pic.twitter.com/2jnFm6mKcB
— Rhys Mcclenaghan (@McClenaghanRhys) July 18, 2021
Also Read: