Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల ఆశలను సజీవంగా ఉంచుతూ భారత మహిళా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు విజయంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.గ్రూప్ జేలో ఉన్న సింధు.. ఈరోజు(ఆదివారం) మహిళల సింగిల్స్‌లో తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగింది. ఇజ్రాయెల్ షట్లర్‌తో తలపడిన సింధు.. కేవలం 28 నిమిషాల్లో మ్యాచును ముగించింది. ఈ మ్యాచ్‌లో పీవీ సింధు 21-7, 21-10తో వరుస సెట్లలో సునాయాసంగా గెలిచింది. ఈ విజయంతో ఆమె మహిళల సింగిల్స్‌లో రెండో రౌండ్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో సింధు మొదటి నుంచి ఆధిపత్యం చెలాయించింది. ఇజ్రాయెల్ షట్లర్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ విజయం సాధించింది.
విజయంతో ప్రారంభం..
26 ఏళ్ల భారత షట్లర్ పీవీ సింధు.. ఇజ్రాయెల్‌కు చెందిన క్సేనియా పోలికార్పోవాపై ఘనవిజయం సాధించి భారత్ పతకాల ఆశలను సజీవంగా ఉంచింది. దీంతో రెండో రౌండ్‌కు చేరుకుని తన పతకం కోసం తన ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. వరుస గేమ్‌లలో ఈ మ్యాచును గెలవడంతో.. సింధు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకుని, రెండవ రౌండ్‌లో అడుగుపెట్టింది.
రియోలో అందుకున్న పతకం రంగును టోక్యోలో మార్చేనా..
పీవీ సింధు తన పేరు మీద ఒలింపిక్ రజత పతకం లిఖించిన సంగతి తెలిసిందే. రియోలో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో సింధు ఈ పతకం గెలిచింది. కానీ, ఈసారి మాత్రం పతకాన్ని మార్చి రికార్డు నెలకొల్పాలని ఎదురుచూస్తోంది. బంగారు పతకంతోనే తిరిగొస్తానంటూ.. ధీమా వ్యక్తం చేస్తూ టోక్యో బరిలో నిలించింది.
#Tokyo2020 | #Badminton : PV Sindhu beats Polikarpova 21-7, 21-10 in her opening match. #Tokyo2020 #Cheer4India @ianuragthakur @BAI_Media @PMOIndia pic.twitter.com/Mwmj284obb
— Dept of Sports MYAS (@IndiaSports) July 25, 2021
Also Read:
Tokyo Olympics 2021: రజత పతకధారి మీరాబాయి చానుకి బంఫర్ ఆఫర్..!