Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ భవానీ దేవి ప్రయాణం 32 వ రౌండ్‌లో ముగిసింది. తన రెండవ మ్యాచ్‌లో ఆమె ఫ్రాన్స్‌కు చెందిన మనోన్ బ్రూనెట్ చేతిలో ఓడిపోయింది. ప్రపంచ 3వ నంబర్ బ్రూనెట్‌తో జరిగిన మ్యాచుల్ భవానీ దేవి 15-7తో ఓడిపోయింది. అంతకుముందు టోక్యో ఒలింపిక్స్ వేదికపై భవానీ దేవి తన ప్రయాణాన్ని అద్భుతంగా ప్రారంభించింది. ఒలింపిక్ అరంగేట్రం చేసి, తన మొదటి మ్యాచ్‌ను 15-3 తేడాతో సులభంగా గెలిచింది. వెంటనే రెండో మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఒలింపిక్ వేదికపై ఫెన్సింగ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తొలి భారత మహిళగా భవానీ దేవి పేరుగాంచింది. ట్యునీషియాకు చెందిన నాడియా బెన్ అజీజ్‌పై 6 నిమిషాల 14 సెకన్లలో తన తొలి మ్యాచ్‌ను సులభంగా గెలిచింది. కానీ, తన రెండో మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ 3 ఫెన్సర్ ముందు సత్తా చాటలేకపోయింది. భవానీ ఓటమితో ఫెన్సింగ్‌లో భారత పతక ఆశలు ఆవిరయ్యాయి.
ఫ్రాన్స్‌కు చెందిన మనోన్ బ్రూనెట్ రియోఒలింపిక్స్లో సెమీ ఫైనలిస్ట్. అక్కడ ఆమె నాలుగవ స్థానంలో చేరింది. పతకానికి చాలా దగ్గరగా వెళ్లింది. కానీ, టోక్యోలో ఆమె తన లక్ష్యాన్ని పెట్టలేకపోయింది. రియోలో తన అనుభవం టోక్యోలో పనిచేయలేకపోయింది. తొలి మ్యాచ్లో అద్భుతంగా ఆడి, తన దూకుడును ప్రదర్శించి, అజిజీపై విజయం సాధించింది. తొలి ఒలింపిక్స్ ఆడుతున్న భవానీ దేవి.. ఒత్తిడిని భరించి, రెండవ మ్యాచ్ వరకు చేరుకుంది. దీని నుంచి మరిన్ని పాఠాలు నేర్చుకుంటానని, మరోసారి కచ్చితంగా తన సత్తా చూపిస్తానని పేర్కొంది.
Also Read: