Tokyo Olympics 2020: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టోక్యో ఒలింపిక్స్ సందడి కనిపిస్తోంది. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నా.. అథ్లెట్లు పతకాల కోసం పోటీపడున్నారు. నెట్టింట్లోనూ ఒలింపిక్స్ సందడి మాములుగా లేదు. ఇలాంటి సందర్భంలోనే నాసా ఓ ఫొటోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో కాంతులు నింపుతూ తెగ వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే… అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) టోక్యోలోని ఒలింపిక్ విలేజ్ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇది రాత్రవేళ స్పేస్ స్టేషన్ నుంచి తీసింది కావడంతో.. ఒలింపిక్ విలేజ్ వెలుగుల జిలుగులు అద్భుతంగా కెమెరాలో బంధించబడ్డాయి. ఈ ఫొటో ఐఎస్ఎస్‌కు చెందిన వింటేజ్ పాయింట్ నుంచి తీసినట్లు పేర్కొంది. ఈ ఫొటోలో ఒలింపిక్ విలేజ్ విద్యుత్ కాంతులలో జిల్.. జిల్ మంటూ వెలుగులు చిమ్ముతుండడాన్ని గమనించవచ్చు.
ఈ ఫొలోను నాసా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఈ పోస్ట్ పెట్టిన 12 గంటల్లో 5.3 లక్షల లైక్స్‌తో దూసుకపోతోంది. అలాగే ఎందరో కామెంట్లు చేస్తూ వైరల్‌గా మార్చేశారు. కాగా, జులై 23న ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలు ఆగస్టు 8 వరకూ జరగనున్నాయి. ఈ క్రీడల్లో ఇప్పటివరకు భారత్ తరుపున వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను ఒక్కరే పతకం సాధించారు. టోక్యో ఒలింపిక్ పతకాల లిస్టులో భారత్ ప్రస్తుతం 43వ స్థానంలో నిలిచింది. 13 స్వర్ణాలతో(మొత్తం 22 పతకాలు) జపాన్ తొలిస్థానంలో నిలవగా, 12 స్వర్ణాలతో(మొత్తం 27 పతకాలు) చైనా రెండవ స్థానంలో కొనసాగుతోంది.
Tokyo Olympics 2020: మీరాబాయి చాను తరువాత ఎవరు.. పతకం తెచ్చే లిస్టులో ఎందరున్నారో తెలుసా..?