Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ 2020లో నేడు (గురువారం) భారత్ మిశ్రమ ఫలితాలను అందుకుందని చెప్పాలి. మొదటగా భారత హాకీ జట్టు కాంస్య పతకం ప్లే-ఆఫ్‌లో జర్మనీని 5-4తో ఓడించి 41 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్‌లో మొదటి పతకాన్ని సాధించింది.
ఇక బంగారం పతకం పక్కా అనుకున్న రెజ్లర్‌లో ఇండియన్ ప్లేయర్ రవి దహియా బంగారు పతకాన్ని చేజార్చుకున్నాడు. కానీ భారత ఖాతాలో మరో పతకాన్ని (రజతం) చేర్చాడు. ఇక దీపక్ పూనియా 86 కేజీల ప్లే-ఆఫ్‌లో శాన్ మారినోకు చెందిన అమిన్ చేతిలో ఓటమిని చవిచూశాడు. మహిళల 53 కిలోల విభాగంలో క్వార్టర్ ఫైనల్స్‌లో బెలారస్‌కు చెందిన వెనెస్సా చేతిలో ఇండియన్ ప్లేయర్ వినేష్ ఫోగట్ ఓటమిని చవి చూసింది. ఇక 20 కిలోమీటర్ల నడకలో భారత్‌కు చెందిన సందీప్ కుమార్ 23 వ స్థానంలో నిలిచాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్‌లో పతకం అందుకోవడంతో హాకీ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా జట్టులోని పంజాబ్ క్రీడాకారులకు ఆ రాష్ట్రం నజరానా ప్రకటించింది కూడా. ఇక భారత హాకీ జట్టు విజయంపై జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రోత్సాహం కారణంగానే ఈ కల సాకారమైందన్నాడు. ఈ ప్రయాణంలో అనుక్షణం తన మద్ధతు అందించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు అంటూ వీడియో పోస్ట్ చేశాడు మన్రీత్.
This dream won’t be possible without the encouragement & vision of Hon’ble Chief Minister of Odisha Shri Naveen Patnaik ji @CMO_Odisha @sports_odisha who has been supporting us throughout this journey – thank you so much sir from the team and I ?? #OdishaCelebratesOlympicGlory pic.twitter.com/WkdNxPiGk2
— Manpreet Singh (@manpreetpawar07) August 5, 2021
తాజాగా రెజ్లర్ రవి కుమార్ రజత పథకంతో భారత్ ఖాతాలో పతకాల సంఖ్య 5కి చేరింది. టోక్యో ఒలింపిక్స్ – 2020లో మొదటి పతకాన్ని మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను గెలుచుకుంది. మీరాబాయి రజత పథకంతో బోణీ చేసింది. అనంతరం మహిళా బాక్సర్ లవ్లినా బోర్గోహైన్, మహిళా బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. ఇక తాజాగా భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం గెలుచుకోగా.. పురుషుల రెజ్లింగ్ ఆటగాడు రవి దహియా రజత పతకాన్ని సాధించాడు.
భారత పురుష రెజ్లర్ దీపక్ పూనియా 86 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని చేర్చుకున్నాడు. మొదటి రౌండ్‌లో రాణించిన దీపక్ రెండో రౌండ్‌లో మాత్రం వెనబడ్డాడు. దీంతో 4-2 తేడాతో శాన్ మారినోకు చెందిన అమిన్ చేతిలో ఓటమి చవిచూశాడు. ఇలా భారత్ మరో పతకాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
భారత్‌కు రజత పతకం తీసుకొచ్చిన రవి కుమార్‌పై ఆయన సొంత రాష్ట్రమైన హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టార్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇందులో భాగంగా.. రూ. 4 కోట్ల నగదు, క్లాస్ 1 ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం ఇప్పిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా రవి స్వగ్రామంలో రెజ్లింగ్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
భారత ఖాతాలో మరో పతకాన్ని చేర్చిన రవి కుమార్ దహియాకు ప్రముఖుల నుంచి ప్రశసంలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా రవికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ట్వీట్ చేస్తూ రవి దేశానికి గర్వకారణంగా నిలిచాడని ట్వీట్ చేశారు.
Great going, Ravi Dahiya! Congratulations on wrestling your way to the #Silver .#Olympics
— Rahul Gandhi (@RahulGandhi) August 5, 2021
Congratulations to Ravi Dahiya for the Silver medal in the #Olympics. He has distinguishing himself as a fine wrestler and a wonderful sportsperson. He has made the country proud with his achievement.#Tokyo2020
— Rajnath Singh (@rajnathsingh) August 5, 2021
చివరి వరకు పోరాడి ఓడినా.. రవి కుమార్ దేశానికి మరో పతకాన్ని సంపాదించి పెట్టాడు. దీంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్‌లో హోరా హోరిగా జరిగిన మ్యాచ్‌లో ఓడిన రవి వెండి పతకాన్ని సొంతం చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘రవి కుమార్ దహియా అద్భుతమైన ఆటగాడు. అతను కనబరిచిన స్ఫూర్తి అద్భుతం. వెండి పతకం గెలిచుకున్నందుకు రవి కుమార్‌కు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.
Ravi Kumar Dahiya is a remarkable wrestler! His fighting spirit and tenacity are outstanding. Congratulations to him for winning the Silver Medal at #Tokyo2020. India takes great pride in his accomplishments.
— Narendra Modi (@narendramodi) August 5, 2021
టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా రజత పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్లో జవూర్(ఆర్ఓసీ)పై ఓటమి పాలై.. సిల్వర్ పతకంతో సరిపెట్టుకున్నాడు.
భారత ఒలింపిక్స్‌లో మరో అద్భుత మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. భారత్ స్టార్ రెజ్లర్ రవి దహియా ప్రత్యర్థి నురిస్లామ్ సనయొవ్‌తో తలపడి పురుషుల 57 కేజీల కేటగిరీ సెమీస్‌లో నాలుగో సీడ్ రవి ‘విక్టరీ బై ఫాల్’ పద్దతిలో విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఫైనల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో రవి గెలిచి చరిత్రను తిరగరాస్తారని అంతా ఆశిస్తున్నారు. భారత ఒలింపిక్స్ రెజ్లింగ్లో తొలి స్వర్ణాన్ని అందుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. మరి స్వర్ణ పతకం సాధ్యమవుతుందో లేదో చూడాలి.
ఒలింపిక్స్‌లో మహిళల రెజ్లింగ్‌లో భారత్‌కు పతకం చేజారిపోయింది. మహిళల రెజ్లింగ్ 53 కేజీల విభాగం ఫ్రీస్టైల్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు నిరాశ ఎదురైంది. వినేశ్ మొదట క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. బెలారస్ క్రీడాకారిణి వనేసా చేతిలో పరాజయం చెందింది. ఒకవేళ వనేసా ఫైనల్ చేరితో వినేశ్‌కు రెపిచేజ్ రౌండ్‌లో అవకాశం దక్కేది. కానీ క్వార్టర్ ఫైనల్లో వినేశ్‌ను ఓడించిన వనీసా(బెలారస్) ఫైనల్‌కు చేరుకోకపోవడంతో వినేశ్ కాంస్య పతకం కోసం మ్యాచ్ ఆడే అవకాశం కూడా కోల్పోయింది. దీంతో వినేశ్ పతక ఆశలు చెదిరిపోయాయి.
పురుషుల 20 కి.మీల రేస్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన సందీప్ కుమార్ 23వ ర్యాంకుకు పరమితమయ్యాడు. రాహుల్ రోహిల్లాకు 47వ ర్యాంకు, కేటీ ఇర్ఫాన్ 51వ స్థానంలో నిలిచారు. ఇక ఫైనల్‌లో స్టానో మాసిమో(ఇటలీ) విజేతగా నిలిచాడు. ఆ తర్వాతి రెండు స్థానాల్లో ఇకెడా కోకి(జపాన్), యమనీషి తోచికాజు(జపాన్) ఉన్నారు.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత మెన్స్ హాకీ జట్టు సంచలన విజయం సాధించడం పట్ల దేశ ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో పతకం గెలవడంతో జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీసీఐ తన ట్విట్టర్ వేదికగా అభినందించింది. Sky is Blue indeed అంటూ ట్వీట్ చేసింది.
The Sky is Blue indeed ????
Heartiest congratulations #TeamIndia for winning a Bronze Medal ?
The entire nation is proud of you. #Cheer4India https://t.co/Y3aOdhuo2P
— BCCI (@BCCI) August 5, 2021
41 ఏళ్ల సుధీర్ఘ విరామం తర్వాత హాకీ పురుషుల జుట్టు కాంస్య పతకాన్ని సాధించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ దేశం ప్లేయర్స్‌ను అభినందిస్తోంది. ఈ క్రమంలోనే పార్లమెంట్‌లో కూడా ఇండియన్ ప్లేయర్స్‌కు ప్రశంసలు దక్కాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాకీ జట్టుకు భాకాంక్షలు తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో జర్మనీపై 5-4తో విజయం సాధించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్‌లో పతకం అందకోవడంతో హాకీ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా జట్టులోని పంజాబ్ క్రీడాకారులకు ఆ రాష్ట్రం నజరానా ప్రకటించింది. తమ రాష్ట్రానికి చెందిన ప్రతి క్రీడాకారుడికి రూ.కోటి బహుమానంగా ఇవ్వనున్నట్లు క్రీడామంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధి ప్రకటించారు.
ఒలింపిక్స్ వేడుకలకు ఆతిథ్యమిస్తోన్న జపాన్ రాజధాని టోక్యోలో ఈ రోజు (గురువారం) ఒక్కరోజే ఏకంగా 5,042 కొత్త కరోనా కేసులు నమోదుకావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి టోక్యోలో అత్యధిక కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇక టోక్యోలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,36,138కి చేరింది. ప్రపంచ నలుమూలల నుంచి ఆటగాళ్లు వచ్చిన నేపథ్యంలో టోక్యోలో ఈ స్థాయిలో కరోనా కేసులు పెరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఒలింపిక్స్‌లో హాకీలో భారత జట్టు జర్మనీపై గెలుపొంది చరిత్ర సృష్టించిన వెంటనే ప్రధాని మోదీ.. కెప్టెన్, కోచ్‌లతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి అభినందనలు తెలియజేసారు.
4 కి.మీ రేసు పూర్తయ్యే వరకు సందీప్ కుమార్ రెండవ స్థానంలో ఉన్నారు. దీని తర్వాత 8 కి.మీ, సందీప్ కుమార్ ఇక్కడ కూడా రెండవ స్థానంలో ఉన్నారు.
భారత స్టార్ మహిళా గోల్ఫ్ క్రీడాకారిణి అదితి అశోక్ రెండవ రౌండ్‌లో కూడా తన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగించారు. మొదటి రౌండ్‌లో 69 పాయింట్లు సంపాదించగా.. రెండవ రౌండ్‌లో 64 పరుగులు చేసింది. దీనితో ఆమెపై పతకం ఆశలు పుంజుకున్నాయి.
హాకీ జట్టుకు పంజాబ్ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబ్ ప్లేయర్స్ ప్రతీ ఒక్కరికి రూ. 1 కోటి నజరానా ఇస్తామని ప్రకటించింది.
దీక్ష దాగర్ రెండవ రౌండ్ పూర్తి చేసింది. ఇప్పుడు 54వ స్థానంలో ఉంది. ఆమె రెండు రౌండ్లలో 76, 72 పాయింట్లు సాధించింది.
Will be totally asking for a recording of this India-Germany game at some point. Till then, we are all the Indian Hockey Team today! Fantastic fightback, boys. To see us on the podium of an Olympic Games after 41 years is all things emotional. GET IN! #TeamIndia #Tokyo2020
— Sunil Chhetri (@chetrisunil11) August 5, 2021
Congratulations to our men’s hockey team for winning an Olympic Medal in hockey after 41 years. The team showed exceptional skills, resilience & determination to win. This historic victory will start a new era in hockey and will inspire the youth to take up and excel in the sport
— President of India (@rashtrapatibhvn) August 5, 2021
ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన హాకీ జట్టుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. కాంస్య పతకాన్ని దేశానికీ తీసుకొస్తున్న పురుషుల జాకీ జట్టుకు అభినందనలు తెలిపారు. భారతీయుల ఎన్నో ఏళ్ల కలను సాకారం చేశారంటూ వారిని కొనియాడారు. దేశంలో మిమ్మల్ని చూసి గర్విస్తోందని.. యువత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటుందని ప్రధాని మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. బెలారస్‌కు చెందిన వెనెస్సాపై 3-9 తేడాతో ఓటమిపాలైంది. వినేష్ ఇప్పుడు రీపేజ్ మ్యాచ్ కోసం వెనెస్సా ఫైనల్స్‌కు వెళ్ళేంతవరకు వేచి చూడాలి.
41 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒలింపిక్స్‌లో భారత్ హాకీలో పతకం సాధించింది. ఈ పతకం 1980 నుండి ఎదురుచూస్తోంది. దేశం మొత్తం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఫీట్‌ను ఈ బృందం చేసింది. మన్ ప్రీత్ సహా ఆటగాళ్లందరి కళ్లలో ఆనందం కన్నీళ్లు కనిపిస్తుంది.
చివరి ఆరు సెకన్లలో జర్మనీకి పెనాల్టీ కార్నర్ లభించింది కానీ శ్రీజేష్ దానిని కాపాడడమే కాకుండా భారత విజయాన్ని కూడా నిర్ధారించాడు. కాంస్య పతకం మ్యాచ్‌లో భారత్ 5-4 తేడాతో విజయం సాధించింది
టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో జర్మనీపై 5-4తో విజయం సాధించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్‌లో పతకం అందుకుంది.
జర్మనీ ఇప్పుడు తన గోల్ కీపర్‌ను తీసివేసి, అదనపు ఆటగాడిని పిలిచింది. భారతదేశానికి ఇదే సరైన అవకాశం. జర్మనీ కూడా పూర్తి శక్తితో దాడి చేస్తుంది. ఇది డూ ఆర్ డై సిట్యువేషన్
జర్మనీకి పెనాల్టీ కార్నర్ లభించింది. దీనితో చక్కటి గోల్ సాధించింది. స్కోర్‌ను పెంచుకుంది. ప్రస్తుతం ఇండియా 5-4తో ఆధిక్యంలో ఉంది.
ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుతంగా పుంజుకుంది. 34వ నిమిషంలో, సింరంజీత్‌ని గురజాంత్ సింగ్ కౌంటర్ రన్‌తో గోల్‌గా మార్చడంతో జట్టుకు 5-3 ఆధిక్యం లభించింది.
భారత రెజ్లర్ వినేష్ డబుల్ లెగ్ లాక్‌తో మరో రెండు పాయింట్లు సాధించాడు. మాటిసన్ చివరి 30 సెకన్లలో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. వినేష్ ఫోగట్ తన మొదటి మ్యాచ్‌ను 7-1తో గెలుచుకుంది
31వ నిమిషంలో భారత్‌కు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. రూపిందర్ సింగ్ స్ట్రోక్‌ను సద్వినియోగం చేసుకుని జట్టుకు 4-3 ఆధిక్యాన్ని అందించాడు
ప్రథమార్థం ముగిసింది. రెండవ త్రైమాసికంలో జర్మనీ వరుసగా రెండు గోల్స్, భారత జట్టు రెండు పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మార్చి 3-3తో స్కోర్ సమం చేసింది. భారత హాకీ జట్టుకు తదుపరి 30 నిమిషాలు చాలా ముఖ్యం
వినేష్ ఫోగట్ స్వీడన్‌కు చెందిన మాటిసన్‌ను ఎదుర్కొంటున్నాడు. లెగ్ ఎటాక్‌తో వినేష్ దాదాపు ప్రత్యర్థిని చిత్తు చేశాడు. భారత రెజ్లర్ 4-0తో ఆధిక్యంలో ఉన్నాడు
అన్షు మంచి డిఫెన్స్ చూపించినప్పటికీ చివరి నిమిషంలో రష్యాకు చెందిన కొబోవా పాయింట్లు సాధించి 5-1తో మ్యాచ్ గెలిచింది. 19 ఏళ్ల అన్షు ప్రయాణం ఇక్కడతో ముగిసింది.
26వ నిమిషంలో, భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది, హర్మన్‌ప్రీత్ సింగ్ డ్రాగ్-ఫ్లిక్‌ను జర్మన్ గోల్ కీపర్ నిలిపేశాడు. అయితే రీబౌండ్‌లో హార్దిక్ సింగ్ మళ్లీ గోల్ చేశాడు. దీని తర్వాత, 28వ నిమిషంలో జట్టుకు మళ్లీ పెనాల్టీ కార్నర్ లభించింది. ఈసారి హర్మన్ ప్రీత్ సింగ్ డ్రాగ్ ఫ్లిక్ భారత్ 3-3తో స్కోర్ సమం చేసింది.
భారత జట్టుకు పెద్ద దెబ్బ. జర్మనీ వరుసగా రెండు గోల్స్ చేయడం ద్వారా 3-1 ఆధిక్యాన్ని సాధించింది.
అన్షు మాలిక్ తన రీఛేజ్ మ్యాచ్‌లో ROC వలేరియా కొబ్లోవాతో తలబడుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే కాంస్య పతకం ఖాయం.
రెండో క్వార్టర్ మొదట్లోనే భారత్‌కు శుభారంభం దక్కింది. సిమ్రాన్‌జిత్ చక్కటి రివర్స్ హిట్ స్ట్రైక్‌తో గోల్ సాధించి 1-1తో స్కోర్‌ను సమం చేశాడు.
మొదటి క్వార్టర్ ముగిసే సమయానికి భారత హాకీ జట్టు 0-1తో వెనుకబడి ఉంది. జర్మనీ జట్టు ముందంజలో ఉంది. ఇదే భారత పురుషుల హాకీ జట్టుపై ఒత్తిడిని పెంచుతోంది.
15వ నిమిషంలో, శ్రీజేష్ జర్మన్ ఆటగాడిని ఆపడానికి ప్రయత్నించాడు. దీనితో జర్మనీకి పెనాల్టీ కార్నర్ లభించింది. ఒకదాని తర్వాత ఒకటి, పెనాల్టీ కార్నర్‌లు వచ్చినా భారత్ జట్టు జర్మనీకి అడ్డుకోగలిగింది.
మన్‌దీప్ సింగ్ భారత జట్టుకు మొదటి పెనాల్టీ కార్నర్ (PC) ఇచ్చాడు. రూపిందర్ సింగ్ డ్రాగ్ ఫ్లిక్‌తో కార్నర్‌కు ట్రై చేయగా.. బంతి గోల్ మీదుగా వెళ్లలేదు.
రెండో నిమిషంలో జర్మనీ గోల్ సాధించింది. ఆ జట్టుకు చెందిన తైమూర్ ఒరాజ్ మొదటి గోల్ సాధించి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
ఈరోజు కాంస్య పతక పోరులో భారత పురుషుల హాకీ జట్టు జర్మనీతో తలపడబోతోంది. 1980 నుండి ప్రతి ఒలింపిక్స్ నుండి ఖాళీ చేతులతో తిరిగి వస్తోన్న జట్టు.. ఈసారి పతకం సాధించాలన్న కసితో ఉంది.