Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో శనివారం భారత్‌కు నిరాశే దక్కింది. బంగారు పతకం సాధించే దిశగా సాగిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన పోరాటాన్ని సెమీస్‌లోనే ఖతం చేసేంసింది. మరోవైపు బాక్సర్లు అమిత్ పంగల్, పూజారాణి ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు. హాకీ మహిళలు అద్భుత విజయంతో క్వార్టర్స్ ఫైనల్ చేరుకున్నారు. ఆర్చర్ అతాను దాస్ కూడా పతకం సాధించకుండా నిరాశపరిచాడు. అథ్లెటిక్స్‌లో కమల్‌ప్రీత్ ఫైనల్ చేరడం ఒక్కటే గుడ్ న్యూస్ దక్కింది. అయితే ఆదివారం కూడా భారత అథ్లెట్లు పలు పోటీల్లో పాల్గొననున్నారు. పీవీ సింధు కాంస్య పోరులో చైనా ప్లేయర్ హే బింగ్ జియోతో పోరాడనుంది.
భారత అథ్లెట్ల నేటి (ఆదివారం) షెడ్యూల్..
1. బ్యాడ్మింటన్-సాయంత్రం 5 గంటలకు
మహిళల సింగిల్స్ బ్రాంజ్ మెడల్ పోరు (పీవీ సింధు vs హే బింగ్ జియో (చైనా))
2. బాక్సింగ్- ఉదయం 9.30 గంటలకు
పురుషుల హెవీ వెయిట్(91+ కేజీలు) క్వార్టర్ ఫైనల్ (సతీశ్ కుమార్ vs బకోదర్ జలోలోవ్(ఉజ్బెకిస్తాన్))
మధ్యాహ్నం 3.36 గంటలకు- మహిళల మిడిల్ వెయిట్(69-75 కేజీ) క్వార్టర్ ఫైనల్ 4 (పూజా రాణి vsకియాల్ లి (చైనా))
3. హాకీ – సాయంత్ర 5.30 గంటలకు
పురుషుల క్వార్టర్ ఫైనల్ – భారత్ vs గ్రేట్ బ్రిటన్
4. గోల్ఫ్
ఉదయం 5.55 గంటలకు- పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 4(అనిర్బన్ లాహిరి)
ఉదయం 4.11 గంటలకు- పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 4(ఉదయన్ మానే)
5. ఈక్వెస్ట్రెయిన్ – ఉదయం 4.15 గంటలకు
క్రాస్ కంట్రీ ఈవెంటింగ్ టీమ్, వ్యక్తిగతం
India vs England: సౌతాంప్టన్‌లో టీమిండియా దిగ్గజాల ఫ్లాప్ షో.. 266 పరుగుల తేడాతో ..!
ఇంగ్లండ్‌లో ధోని స్నేహితుడి సూపర్ ఇన్నింగ్స్.. హ్యాట్రిక్‌తో ప్రత్యర్థి నడ్డి విరిచాడు..!