టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ముందడుగు వేసింది. ఆర్చరీ మిక్స్‌డ్ విభాగంలో భారత్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అర్హత సాధించింది. చైనాకు చెందిన ప్లేయర్స్‌పై దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ 5-3 తేడాతో అద్భుత విజయాన్ని సాధించారు. ఈ గెలుపుతో భారత్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి వెళ్లగా.. అక్కడ దక్షిణ కొరియాతో తలపడే అవకాశం ఉంది. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఎలవెనిల్(626.5 పాయింట్స్), అపూర్వి(621.9 పాయింట్స్) ఫైనల్‌కు క్వాలిఫై కాలేకపోయారు.
భారత పురుషుల హాకీ టీం తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఒలింపిక్స్‌లో తొలి బోణీ కొట్టింది. ఇవాళ పూల్-ఎలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-2 తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. రెండు గోల్స్ సాధించిన హర్మన్‌ప్రీత్ సింగ్.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Also Read:
రోడ్డుపై విచిత్ర యాక్సిడెంట్.. క్షణాల్లో సీన్ రివర్స్.. షాకింగ్ వీడియో!
జింకల మందపై ఎటాక్ చేసిన పెద్దపులి.. ఈ ఫోటోలో అదెక్కడ ఉందో కనిపెట్టండి బాసూ.!
ఆకుకూరలు ఫ్రెష్‌గా ఉండాలా.? ఇలా మాత్రం చేయొద్దు! తస్మాత్ జాగ్రత్త.. వైరల్ వీడియో!