Golfer Aditi Ashok: టోక్యోలో రేపు వర్షం వస్తే.. భారత్ ఖాతాలో మరో రజతం ఖాయం.. లేదంటే..

|

Aug 06, 2021 | 12:59 PM

Tokyo Olympics 2021 Golfer Aditi Ashok: టోక్యో ఒలింపిక్స్ లో ఈసారి భారత్ క్రీడాకారులు ఎన్నడూ పాల్గొనని ఈవెంట్స్ లో పాల్గొన్నారు. తమ పరిధిమేరకు వారు అద్భుత ప్రదర్శన చేశారు.. అయితే ఇప్పుడు..

Golfer Aditi Ashok: టోక్యోలో రేపు వర్షం వస్తే.. భారత్ ఖాతాలో మరో రజతం ఖాయం.. లేదంటే..
Golfer Aditi Ashok
Follow us on

Tokyo Olympics 2021 Golfer Aditi Ashok: టోక్యో ఒలింపిక్స్ లో ఈసారి భారత్ క్రీడాకారులు ఎన్నడూ పాల్గొనని ఈవెంట్స్ లో పాల్గొన్నారు. తమ పరిధిమేరకు వారు అద్భుత ప్రదర్శన చేశారు.. అయితే ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఎవరూ ఊహించని క్రీడలో భారత్ ఖాతాలో మరో పతకం చేరే అవకాశం ఉన్నట్లు క్రీడాపండితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి కొనసాగుతూ.. అదృష్టం కలిసివస్తే.. ఈసారి ఒలింపిక్స్ లో గోల్ఫ్ లో రజతం లేదా కాంస్యం పతకం సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.

ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత యువ కెరటం అదితి అశోక్‌ టోక్యో ఒలింపిక్స్ లో తన అద్భుత ప్రదర్శనతో అదరగొడుతోంది. గోల్ఫ్ లో వివిధ దేశాలనుంచి 60 మంది పోటీపడుతున్నారు. మూడో రౌండ్‌ ముగిసే సరికి అదితి అశోక్‌ సూపర్ పెర్ఫార్మెన్స్ తో రెండో స్థానంలో నిలిచింది. పతాకాన్ని నిర్ణయించే కీలకమైన రౌండ్ శనివారం జరగనుంది.

అయితే ప్రస్తుతం టోక్యో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ ఎండలు మండిస్తుంటే.. మరికవైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రేపు గోల్ఫ్ జరిగే ప్రాంతంలో భారీగాలులు వీస్తూ.. భార వర్షం కనుక కురిస్తే.. గోల్ఫ్ నాలుగో రౌండ్ పై ప్రభావం చూపనుంది. దీంతో మూడో రౌండ్ వరకూ ఉన్న ఫెరఫార్మెన్స్ ఆధారంగా తీసుకుని ఫలితాలను ప్రకటిస్తారు. అదే కనుక జరిగే మూడో రౌండ్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న అదితికి రజత పతకం ఖాయం..

మూడో రౌండ్ ముగిసేసరికి అమెరికాకు చెందిన కొర్దా నెల్లీ 198 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక భారత గోల్ఫ్ క్రీడాకారిణి అదితి 201 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తొలిరౌండ్లో 67, రెండో రౌండ్లో 66, మూడో రౌండ్లో 68 పాయింట్లు సాధించింది. భారత్‌కే చెందిన దీక్షా దాగర్‌ 220 పాయింట్లతో ఉమ్మడిగా 51వ స్థానంలో నిలిచింది. గోల్ఫ్‌లో ఎవరికి తక్కువ స్కోరుంటే వారే విజేతగా ఆవిర్భవిస్తారు.

 

Also Read: CM Jagan-PV Sindhu: సీఎం జగన్‌ కలిసిన పీవీ సింధు.. ఏపీలో అకాడమీ ఏర్పాటుపై చర్చ