Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ -2020లో ఫ్రాన్స్ సూపర్ హెవీవెయిట్ బాక్సర్ క్వార్టర్ ఫైనల్స్‌లో అనర్హతకు గురయ్యాడు. దీంతో దాదాపు గంటపాటు మ్యాచ్‌లోనే నిరసన తెలిపాడు. ఉద్దేశపూర్వకంగానే తలపై కొట్టినందుకు అతడిపై రిఫరీ అనర్హత వేటు వేశాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో రౌండ్‌లో కేవలం నాలుగు సెకన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో రిఫరీ ఆండీ ముస్తాచియో బాక్సర్ మౌరాద్ అలీవ్‌ని అనర్హుడిగా ప్రకటించాడు. రిఫరీ ప్రకారం, ఎలివ్ తన ప్రత్యర్థి బ్రిటిష్ బాక్సర్ ఫ్రేజర్ క్లార్క్ తలను ఉద్దేశపూర్వకంగా బాదేశాడు. అతని కళ్ళ దగ్గర కొన్ని దెబ్బలు ఉన్నాయంటూ ఇలాంటి నిర్ణయం ప్రకటించాడు. దీంతో తీర్పు వెలువడిన వెంటనే ఎలివ్ బాక్సింగ్ రింగ్ వెలుపల కాన్వాస్ మీద కూర్చుని నిరసన తెలిపాడు. అతను అక్కడి నుంచి కదలలేదు. ఫ్రెంచ్ బృందం అధికారులు కూడా అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈమేరకు బాక్సర్ మాట్లాడుతూ, ” అనర్హత వేటు వేయడం తప్పు. నేను ఇలాంటి తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడాలనుకుంటున్నాను. నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను. నా సహచరులు కూడా తప్పుడు నిర్ణయాలకు బాధితులయ్యారు. నా జీవితమంతా దీనికోసం కష్టపడ్డాను. రిఫరీ నిర్ణయం వల్ల నేను దాన్ని కోల్పోయాను. అంతా అయిపోయింది” అంటూ నిరసన ప్రకటించాడు.
ఈ నిరసన 30 నిమిషాలకు పైగా సాగింది. అప్పుడు అధికారులు వచ్చి అలైవ్‌తో పాటు ఫ్రెంచ్ బృందంతో మాట్లాడారు. ఎలివ్ అప్రాన్‌ను విడిచిపెట్టాడు. ” నేను ఈ మ్యాచ్‌లో విజయం సాధించగలిగాను. కానీ, నేను అప్పటికే అనర్హుడిగా ప్రకటించారు. నా జీవితమంతా దీని కోసం సిద్ధమయ్యాను. కాబట్టి ఈ ఫలితంపై కోపం రావడం సహజం” అంటూ ఆవేదన చెందాడు.
గట్టి పోటీ
ఎలివ్, క్లార్క్ మధ్య పోటీ చాలా కఠినంగా సాగింది. ఎలివ్ బాగా ఆడాడు. కానీ, అనర్హుడిగా ప్రకటించడంతో పతకం క్లార్క్‌కు దక్కింది. అనంతరం క్లార్క్ మాట్లాడుతూ, ” అతను ఉద్దేశపూర్వకంగా తలకు తగిలించినా.. లేకపోయినా, నేను ఈ విషయంలో ఏమీ చెప్పలేను. మ్యాచ్ తర్వాత ప్రశాంతంగా ఉండమని అడిగాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read: Viral Video: స్విమ్మింగ్‌లో ఛాంపియన్.. భావోద్వేగంతో చిన్నపిల్లాడిలా కన్నీళ్లు..! వైరలవుతోన్న వీడియో
Tokyo Olympics 2020: ఏడు పతకాలు కొల్లగొట్టిన ఆస్ట్రేలియా స్విమ్మర్.. పలు రికార్డులకు ఎసరు..!