Tokyo Olympics 2021: జపాన్ రాజధాని టోక్యో లో జరుగుతున్న ఒలంపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు అత్యంత పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. పూల్ ఎ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై తలపడిన భారత జట్టు 1-5 తేడాతో ఓటమి పాలైంది. ఆట మొదలైన కొన్ని నిమిషాల్లోనే మహిళల హాకీ ప్రపంచ నెంబర్ వన్ జట్టు నెదర్లాండ్ తన ఆధిపత్యం చెలాయించింది. ఆట ప్రారంభమైన 6వ నిమిషంలోనే నెదర్లాండ్ ప్లేయర్ ఫెలిస్ అల్బర్స్ మొదటి గోల్ అందించింది. అయితే మొదటి హాఫ్ లోనే భారత్ 10వ నిమిషంలో కెప్టెన్ రాణి రాంపాల్ గోల్ చేయడంతో.. స్కోర్ 1-1 తో సమానమైనది. థర్డ్ హాఫ్నుంచి పూర్తిగా ఆటపై నెదర్లాండ్ ప్లేయర్స్ ఆధిపత్యం కొనసాగింది. 33వ నిమిషంలో మార్గాట్ జెఫెన్ గోల్ చేయగా, 43వ నిమిషంలో ఫెలిస్ అల్బర్స్, 45వ నిమిషంలో ఫెడేరిక్ మట్లా వరుస గోల్స్ చేయడంతో మూడో క్వార్టర్ ముగిసేసరికి 4-1 గోల్స్ ను సాధించింది. ఫోర్త్ క్వార్టర్‌లో నెదర్లాండ్ ప్లేయర్ మసక్కర్ మరో గోల్ చేయడంతో స్కోర్ 1-5 తో భారత్ ఓడిపోయింది.
Also Read: మీరాభాయి చానుపై కరణం మల్లీశ్వరి ప్రశంసల వర్షం.. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహిస్తే..