Tokyo Olympics 2021: అథ్లెట్లను ఉత్సాహపరిచిన టీమిండియా క్రికెట్లరు.. వీడియో పంచుకున్న బీసీసీఐ! జులై 17 న టోక్యో బయలుదేరనున్న అథ్లెట్లు

టోక్యో ఒలింపిక్స్‌ 2020లో పాల్గొనేందుకు భారత్ నుంచి దాదాపు 120 మంది అథ్లెట్లు అర్హత సాధించారు. మొదటి బ్యాచ్‌ ఆటగాళ్లు జులై 17న టోక్యోకు బయలుదేరనున్నారు.

Tokyo Olympics 2021: అథ్లెట్లను ఉత్సాహపరిచిన టీమిండియా క్రికెట్లరు.. వీడియో పంచుకున్న బీసీసీఐ! జులై 17 న టోక్యో బయలుదేరనున్న అథ్లెట్లు
Mithali Rohit

Edited By: Venkata Chari

Updated on: Jul 20, 2021 | 11:58 AM

Tokyo Olympics 2021: భారత అథ్లెట్లు మరో ఆరు రోజుల్లో టోక్యో ఒలింపిక్స్ ‌కోసం బయలుదేరనున్నారు. దాంతో దేశ వ్యాప్తంగా అథ్లెట్లకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా #Cheer4India అంటూ అథ్లెట్లలో స్ఫూర్తి నింపారు. ఈమేరకు మోడీ ఈ నెల 13 న అథ్లెట్లతో వర్చువల్‌గా మాట్లాడనున్నారు. అయితే తాజాగా ప్రముఖ క్రీడాకారులు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు. బీసీసీఐ తరుపున టీమిండియా ఆటగాళ్లు అథ్లెట్లకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు బీసీసీఐ ఓ వీడియోను నెట్టింట్లో పంచుకుంది. ఇందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రహానే, మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ ఇలా చాలామంది క్రికెటర్లు అథ్లెట్లకు ఛీర్స్ తెలియజేశారు.

ఐఓఏకు రూ.10 కోట్లు అందించిన బీసీసీఐ
క్రీడాకారుల శిక్షణ కోసం బీసీసీఐ రూ. 10 కోట్లను ఐఓఏకు అందించింది. దీనిని ఒలింపిక్స్ కోసం అర్హత సాధించిన ఆటగాళ్ల శిక్షణ, ఇతర అవసరాల కోసం అందిస్తున్నట్లు బీసీసీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. క్రీడా మంత్రిత్వ శాఖ, భారత ఒలింపిక్ సంఘం క్రీడాకారులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రయత్నిస్తాయని బీసీసీఐ ఊర్కొంది.

మరోవైపు భారత్ నుంచి ఈ ఏడాది ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు దాదాపు 120 మంది అథ్లెట్లు అర్హత సాధించారు. మొదటి విడతగా జులై 17న కొంతమంది ఆటగాళ్లు టోక్యో బయలుదేరనున్నారు. గతేడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్.. కరోనా కారనంగా వాయిదా పడి, ఈ ఏడాది టోక్యో వేదికగా జరగనున్నాయి జులై 23 నుంచి మొదలుకానున్న ఒలింపిక్స్, ఆగస్టు 8 న ముగుస్తాయి. అయిత, ఈ పోటీల ప్రారంభోత్సవంలో లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత బాక్సర్ ఎంసీ మేరీ కోమ్, హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ పతాకాధారులుగా వ్యవహరించనున్నారు. అలాగే ముగింపు వేడుకల్లో టాప్ రెజ్లర్ బజరంగ్ పూనియాకు ఈ అవకాశం దక్కింది.

Also Read:

8 ఓవర్లలో 10 వికెట్లు డౌన్.. అంతా కలిపి సాధించిన స్కోర్ చూస్తే షాకవ్వాల్సిందే..!

Wimbledon 2021, Men’s Final: 20వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన నొవాక్‌ జకోవిచ్‌.. తొలిసారి వింబుల్డన్ ఫైనల్ చేరిన బెరెట్టిని!

ENG vs PAK: ఈ బౌలర్లకు భయపడుతోన్న ఇంగ్లండ్ ఆల్‌ రౌండర్‌.. లిస్టులో టీమిండియా స్పిన్నర్ కూడా..!