PV Sindhu: టోక్యో ఓలింపిక్స్‌లో పీవీ సింధు అద్భుతమైన పోరాట పటిమతో చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతాకాన్ని అందుకుంది. వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది. సెమీఫైనల్స్‌లో ఓడిన ఇద్దరు ప్లేయర్స్ మధ్య కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో సింధు ఘనవిజయం సాధించింది. కాంస్యం కోసం జరిగిన పోరులో చైనా షట్లర్ బింగ్ జియావోపై వరసగా సెట్స్ ను గెలిచి కాంస్యం అందుకుంది. భారత దేశానికి రెండో పతాకం అందించింది. దీంతో పీవీ సింధు పై యావత్ భారత దేశం ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
దేశ ప్రధాని మోడీ.. ట్విట్టర్ వేదికగా సింధు తో ఉన్న ఫోటోని షేర్ చేసి.. భారత అత్యుత్తమ ఒలింపియన్లలో ఒకరైన సింధు ఒలింపిక్స్ లో పతకం గెలవడం సంతోషంగా ఉంది. సింధు దేశానికి గర్వకారణం అంటూ ఆమెకు అభినందనలు అని చెప్పారు.
We are all elated by the stellar performance by @Pvsindhu1. Congratulations to her on winning the Bronze at @Tokyo2020. She is India’s pride and one of our most outstanding Olympians. #Tokyo2020 pic.twitter.com/O8Ay3JWT7q
— Narendra Modi (@narendramodi) August 1, 2021
మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సింధు విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన సింధుని సీఎం కేసీఆర్ అభినందించారు. వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలను సాధించిన మొదటి భారత మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు చరిత్ర సృష్టించడం చాలా సంతోషకరంగా కేసీఆర్ ఉందని ప్రశంసించారు.
ఇక ఏపీ సీఎం జగన్ కూడా తెలుగు తేజం సింధు ని ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. భారత దేశానికి రెండు వ్యక్తిగత ఒలంపిక్స్ అందించిన తెలుగు అమ్మాయి సింధు అంటూ అభినందనలు తెలిపారు.
All good wishes and much Congratulations to our Telugu girl @Pvsindhu1 for winning Bronze for India at #TokyoOlympics2020
She is the 1st Indian woman to have won two individual medals at #Olympics.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 1, 2021
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పి.వి.సింధు పోరాట పటిమకు జేజేలు చెప్పారు. ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్యం గెలుచుకొని మన దేశానికి మరో పతకాన్ని అందించిన పి.వి.సింధుకి పవన్ కళ్యాణ్ , జనసేన పక్షాన హృదయపూర్వక అభినందలు చెప్పారు. అంతేకాదు టోక్యోలో మన దేశ పతాకం మరోమారు రెపరెపలాడేలా చేసిన సింధుని చూసి దేశమంతా గర్విస్తోంది.
క్రీడా రంగంలో సింధు ఘన విజయాలు సాధించేలా తీర్చిదిద్దిన ఆమె తల్లితండ్రులకు అభినందనలని తెలిపిన పవన్ కళ్యాణ్ సింధు భవిష్యత్తులో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
Also Read: Bicycle Journey: కేరళ టూ కాశ్మీర్ ఓ యువతి సైకిల్ పై యాత్ర.. యువతకు స్వేచ్ఛ ఇవ్వాలంటున్న తండ్రి