Neeraj Chopra: ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..

|

Aug 17, 2021 | 7:15 PM

Neeraj Chopra: ఒలింపిక్స్‌ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా తీవ్ర అస్వస్తతకు గురయ్యాడు. దాంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.

Neeraj Chopra: ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
Neeraj Chopra
Follow us on

Neeraj Chopra: ఒలింపిక్స్‌ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా తీవ్ర అస్వస్తతకు గురయ్యాడు. దాంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. నీరజ్ చోప్రాను పరిశీలించిన వైద్యులు.. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన అవసరం లేదని తెలిపారు. కొంత విశ్రాంతి తీసుకుంటే అంతా సెట్ అవుతుందని వైద్యులు తెలిపినట్లు నీరజ్ చోప్రా స్నేహితులు వెల్లడించారు. కాగా, ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో నీరజ్ చోప్రాకు నెగిటివ్ అని తేలిన విషయం తెలిసిందే.

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా తొలిసారి తన స్వగ్రామమైన సమల్ఖాకు వచ్చారు. ఈ సందర్భంగా నీరజ్ చోప్రాకు ఘనస్వాగతం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు, ప్రజలు నీరజ్ చోప్రాకు స్వాగతం పలికేందుకు ఆయన స్వగ్రామానికి వచ్చారు. నీరజ్‌పై పూల వర్షం కురిపించారు. కాగా, ఉదయం నుంచి కారు టాప్‌పై నిలుచుని, స్వర్ణ పతకాన్ని ప్రజలకు చూపిస్తూ ఊరిగేంపులో పాల్గొన్నాడు. అయితే, మూడు రోజుల క్రితమే తీవ్ర జ్వరంతో బాధపడిన రీజన్ చోప్రా.. ఆరు గంటల పాటు ఊరేగింపులో పాల్గొనడంతో నీరసించిపోయాడు. ఇంటికి చేరుకోగానే.. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. నీరజ్ చోప్రా త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Also read:

AHA: ఈ అమ్మాయిలు ఏది సూటిగా చెప్పడం రాదా.? ఆకట్టుకుంటోన్న తరగతి గది దాటి ట్రైలర్‌.. ఆహాలో ఎప్పటి నుంచి రానుందంటే.

NASA vs Jeff Bezos: అమెరికా ప్రభుత్వాన్ని కోర్టుకు ఈడ్చిన అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్.. వ్యవహారం ఎక్కడ చెడిందంటే?

Property Benefits: భార్య పేరు మీద ఇల్లు కొనుగోలు చేస్తున్నారా?.. ఆసక్తికర విషయాలు మీకోసమే..