Viral Video: మ్యాచ్ ఓడిపోయిన నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్.. కోర్టులో సహనం కోల్పోయి కోపంతో ఏం చేశాడో తెలుసా?

Tokyo Olympics 2020: నోవాక్ జొకోవిచ్ ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ పురుష టెన్నిస్ ఆటగాడు. కానీ, అలను టోక్యో ఒలింపిక్స్‌లో విజయం సాధించలేదు. స్వర్ణ బరిలోకి దిగిన ఈ ఆటగాడు కనీస కాంస్యం కూడా గెలవకుండానే టోక్యో నుంచి వెనుదిరిగాడు.

Viral Video: మ్యాచ్ ఓడిపోయిన నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్.. కోర్టులో సహనం కోల్పోయి కోపంతో ఏం చేశాడో తెలుసా?
Djokovic

Updated on: Aug 01, 2021 | 9:14 AM

Novak Djokovic: ప్రపంచ అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు నోవాక్ జొకోవిచ్ 2020 టోక్యో ఒలింపిక్స్ నుంచి ఖాళీ చేతులతో తిరిగి రావాల్సి వచ్చింది. అతను గోల్డెన్ స్లామ్ పూర్తి చేయాలనే కలతో బరిలోకి దిగాడు. కానీ, కాంస్య పతకం కూడా గెలవలేకపోయాడు. ఒకే సంవత్సరంలో నాలుగు గ్రాండ్ స్లామ్‌లతో ఒలింపిక్ స్వర్ణం గెలవడం గోల్డెన్ స్లామ్ అంటారు. శనివారం జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో స్పెయిన్‌కు చెందిన పాబ్లో కారెనో బస్టా చేతిలో 6-4, 7-6, 6-3 తేడాతో ఓడిపోయాడు. ఈ మ్యాచ్‌లో నోవాక్ జొకోవిచ్ అనేకసార్లు తన సహనాన్ని కోల్పోయాడు. రాకెట్‌పై తన కోపాన్ని చూపించాడు. జకోవిచ్ 24 గంటల కంటే తక్కువ సమయంలో మూడోసారి ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఒలింపిక్ పురుషుల సింగిల్స్‌లో శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయాడు. గోల్డెన్ స్లామ్ పూర్తి చేసిన మొదటి పురుష క్రీడాకారుడు కావాలనే కలను నెరవేర్చుకోలేకపోయాడు. అనంతరం అతను మిక్స్‌డ్ డబుల్స్ సెమీ ఫైనల్స్‌లో కూడా ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

రెండో సెట్‌లో మ్యాచ్ పాయింట్‌ను సేవ్ చేసిన అనంతరం మూడవ సెట్‌లో సుదీర్ఘ ర్యాలీలో బస్టా షాట్‌ను అడ్డుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో జకోవిచ్ తన రాకెట్‌ను స్టాండ్‌ల వైపు గట్టిగా విసిరాడు. చివరకు బస్టా తన సర్వీస్‌ని బ్రేక్ చేసినప్పుడు కూడా జకోవిచ్ మరోసారి తన రాకెట్‌తో నెట్‌ని కొట్టాడు. జకోవిచ్ చర్యకు బాల్ బాయ్స్ కూడా భయపడ్డారు. జొకోవిచ్ ఆ రాకెట్‌ను తీసుకుని ఫోటోగ్రాఫర్‌లపై విసిరాడు.రాకెట్‌ను నెట్‌పైకి విసిరిన తర్వాత చైర్ అంపైర్ జొకోవిచ్‌ను హెచ్చరించాడు. బస్టా అంపైర్ నుంచి పెనాల్టీ పాయింట్లను డిమాండ్ చేశాడు. మ్యాచ్‌ గెలిచిన అనంతరం బస్టా భావోద్వేగానికి గురై మైదానంలోనే కొంతసేపు పడుకున్నాడు. జొకోవిచ్ చాలా నీరసంగా, ఎంతో నిరుత్సాహంగా కనిపించాడు.

Also Read: టోక్యో ఒలింపిక్స్‌కు ఓ ప్ర‌త్యేక అతిథి ఎంట్రీ నెట్టింట వీడియో వైరల్

Tokyo Olympics 2020 Live: కంచు కోసం సింధు.. క్వార్టర్ ఫైనల్ పోరులో భారత పురుషుల హాకీ టీం.. కీలకం కానున్న ఆదివారం పోటీలు

Tokyo Olympics 2020 Live: కంచు కోసం సింధు.. క్వార్టర్ ఫైనల్ పోరులో భారత పురుషుల హాకీ టీం.. కీలకం కానున్న ఆదివారం పోటీలు