MP Jabir: 400 మీటర్ల హర్డిల్స్ లో చోటు సంపాదించిన వ్యక్తిగా భారత నేవీ ఉద్యోగి ఎంపీ జబీర్ గుర్తింపు సాధించాడు. ఇప్పటి వరకు ఏ పురుష అథ్లెట్ కూడా భారత్ తరపున ఈ ఈవెంట్ లో పాల్గొనలేదు. దీంతో ఎంపీ జబీర్ టోక్యో ఒలింపిక్స్ లో ఈ కేటగిరీలో చోలు సంపాదించి అరుదైన ఘనత సాదించాడు. పాటియాలలో జరిగిన అంతరాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల హర్డిల్స్ కేటగిరీలో 49.78 సెకన్ల టైమ్‌తో గోల్డ్ పతకాన్ని పొందాడు. కాకపోతే ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు కావాల్సిన మార్క్ ని మాత్రం దాటలేకపోయాడు. కానీ, మరోలా తనకు లక్ కలిసి వచ్చింది. ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా నేరుగా టోక్యో ఒలింపిక్స్ లో చోటు సంపాదించాడు. టోక్యో ఒలింపిక్స్ లో మొత్తం 40 మంది అథ్లెట్లు ఈ కేటగిరీలో పోటీ పడనున్నారు. ఇంకా 14 స్థానాలు ఖాళీగా ఉన్నట్లు ఐఓసీ పేర్కొంది.
ఎంపీ జబీర్ ప్రస్తుతం 34వ ర్యాంకుతో కొనసాగుతున్నాడు. కేరళ కు చెందిన ఈ అథ్లెట్ నేరుగా ఒలింపిక్స్ కు అర్హత పొందాడు. పీటీ ఉష తర్వాత కేరళ నుంచి 400 మీటర్ల హర్డిల్స్‌లో పోటీ పడుతున్న రెండవ ప్లేయర్‌గా జబీర్ గుర్తింపు పొందాడు. లాస్ ఎంజెల్స్ లో జరిగిన ఒలింపిక్స్‌లో పరుగులు రాణి పీటీ ఉష ఈ కేటగిరీలో భారత్ తరపున పోటీ చేసింది. కాగా, ఎంపీ జబీర్ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. అయితే, కోవిడ్ తో పలు మ్యాచులు రద్దు అయ్యాయి. కానీ, నేవీ ఉద్యోగిగా సమ్మర్ గేమ్స్ లో పోటీపడనున్నాడు.
జులై 23 నుంచి టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. ఆగస్టు 8 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. భారత్ నుంచి దాదాపు 117 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. ఈమేరకు ఐఓఏ ఒలింపిక్స్ జాబితాను ప్రకటించింది.
Also Read:
ENG vs SL: వన్డేల్లో చెత్త రికార్డును సొంతం చేసుకున్న లంకేయులు..! కలిసి రాని ఇంగ్లండ్ పర్యటన
WI vs SA: కార్ట్ వీల్ తో అలరించిన యూనివర్సల్ బాస్..! వైరలవుతోన్న వీడియో