Tokyo Olympics 2021: సూపర్ ఫామ్‌లో భారత హాకీ టీం.. న్యూజిలాండ్‌పై విజయం..

భారత పురుషుల హాకీ టీం తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఒలింపిక్స్‌లో తొలి బోణీ కొట్టింది. ఇవాళ పూల్-ఎలో భాగంగా...

Tokyo Olympics 2021: సూపర్ ఫామ్‌లో భారత హాకీ టీం.. న్యూజిలాండ్‌పై విజయం..
Hockey Team

Updated on: Jul 24, 2021 | 9:28 AM

భారత పురుషుల హాకీ టీం తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఒలింపిక్స్‌లో తొలి బోణీ కొట్టింది. ఇవాళ పూల్-ఎలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-2 తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. రెండు గోల్స్ సాధించిన హర్మన్‌ప్రీత్ సింగ్.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మొదటిగా న్యూజిలాండ్ 1-0తో లీడ్‌లో ఉన్నప్పటికీ.. ఆ తర్వాత ఇండియా పుంజుకుంది. రూపింద‌ర్ పాల్ సింగ్, ఆ తర్వాత హార్మన్‌ప్రీత్ వెంటవెంటనే గోల్స్ వేయడంతో ఇండియా 2-1తో ఆధిక్యంలోకి వచ్చింది. ఇక సెకండ్ క్వార్టర్‌లోనూ హార్మన్ మరో గోల్ సాధించడంతో ఇండియా లీడ్ మరింతగా పెరిగింది. ఇక థర్డ్ క్వార్టర్‌లో న్యూజిలాండ్ పుంజుకోవడంతో స్కోర్ 2-3గా మారింది. అయితే చివరి క్వార్టర్‌లో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మార్చడంలో న్యూజిలాండ్ తడబడటంతో ఇండియా టీం 3-2తో అద్భుత విజయాన్ని సాధించింది.

Also Read:

రోడ్డుపై విచిత్ర యాక్సిడెంట్.. క్షణాల్లో సీన్ రివర్స్.. షాకింగ్ వీడియో!

జింకల మందపై ఎటాక్ చేసిన పెద్దపులి.. ఈ ఫోటోలో అదెక్కడ ఉందో కనిపెట్టండి బాసూ.!

ఆకుకూరలు ఫ్రెష్‌గా ఉండాలా.? ఇలా మాత్రం చేయొద్దు! తస్మాత్ జాగ్రత్త.. వైరల్ వీడియో!