థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్-1000 బ్యాడ్మింటన్టోర్నీలో భారత ఆటగాళ్లు దూసుకుపోతున్నారు. మలేసియా క్రీడాకారిణి కిసోనా పీవీ సింధు 21-10, 21-12 తో ఓడించి క్వార్టర్ ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టోర్నీ తొలి రౌండ్‌లోనే మాజీ వరల్డ్ నంబర్‌వన్ సైనా నెహ్వాల్‌ను ఓడించిన థాయ్‌ల్యాండ్ నాలుగో సీడ్ రచనోక్కి సింధు గట్టిపోటీ ఇచ్చే చాన్స్ ఉంది.
అంతకుముందు జరిగిన పురుషుల డబుల్స్‌లో దక్షిణ కొరియా 7వ సీడ్ జోడీ సోల్ గ్యు చోయ్, సెయుంగ్ జె సియో పై భారత డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టీ 21-18, 23-21 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరారు.
కాగా భారత షట్లర్ వర్మ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అంతకు ముందు మలేసియా 8వ సీడ్ లీ జీ జియాను ఓడించిన వర్మ.. క్వార్టర్ ఫైనల్స్‌లో డెన్మార్క్ క్రీడాకారుడిని 21-12, 21-9తో సునాయసంగా ఓడించాడు. 40 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో 20 నిమిషాలలోపే ఆటపై వర్మ పట్టు సాధించాడు. సెమీ ఫైనల్లో అడుగు పెట్టాలంటే ప్రపంచ నంబర్ మూడో ఆటగాడు అండర్స్ అంటోన్సెన్ను వర్మ ఓడించాలి.
అటు మిక్స్డ్ డబుల్స్‌లోనూ భారత క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. జర్మనీ ప్రత్యర్థుల్ని 22-20, 14-21, 21-16తో సాత్విక్ సాయి రాజ్, అశ్విని పొన్నప్ప మట్టికరిపించారు. సెమీస్‌లో బెర్త్‌కోసం మలేసియా పెంగ్ సూన్, గో లీ యింగ్‌తో తలపడనున్నారు.