జీవా ధోనిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యువకుడు అరెస్ట్‌

| Edited By:

Oct 12, 2020 | 10:26 AM

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుమార్తె జీవా ధోనిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 16 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

జీవా ధోనిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యువకుడు అరెస్ట్‌
Follow us on

Comments on ziva dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుమార్తె జీవా ధోనిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 16 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు గుజరాత్‌లోని కచ్ జిల్లా ముంద్రా ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించిన రాంచీ పోలీసులు.. అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా, నిజాన్ని ఒప్పుకున్నాడు. ఇక రాంచీ పోలీసులు ఇక్కడకు వచ్చిన తరువాత నిందితుడిని వారికి అప్పగిస్తామని కచ్‌ జిల్లా ఎస్పీ సౌరబ్ సింగ్‌ తెలిపారు.

కాగా ఐపీఎల్‌లో భాగంగా ఇటీవల కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై టీమ్‌ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ధోని సరిగా ఆడకపోవడం వల్లనే చెన్నై ఓడిపోయిందని.. మరోసారి సరిగా ఆడకపోతే జీవా ధోనిపై అత్యాచారం చేస్తానంటూ ఓ యువకుడు సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు చేశాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వీటిని పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఖండించారు. అసలు ఏం ఆలోచిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో రాంచీ పోలీసులు రంగంలోకి దిగి, నిందితుడి జాడను తెలుసుకున్నారు.

Read More:

దేశంలో కరోనా విజృంభణ.. 71 లక్షలు దాటేసిన కేసులు

తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని కేసులంటే