AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: మహిళా దినోత్సవం రోజున విరాట్ భావోద్వేగ సందేశం.. అనుష్క, వామికా ఫోటో షేర్ చేసి..

Virat Kohli: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీమిండియా సారథి విరాట్ కోహ్లీ చాలా ఎమోషనల్ అయ్యాడు. తన భార్య అనుష్క శర్మ..

Virat Kohli: మహిళా దినోత్సవం రోజున విరాట్ భావోద్వేగ సందేశం.. అనుష్క, వామికా ఫోటో షేర్ చేసి..
Shiva Prajapati
|

Updated on: Mar 08, 2021 | 3:51 PM

Share

Virat Kohli: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీమిండియా సారథి విరాట్ కోహ్లీ చాలా ఎమోషనల్ అయ్యాడు. తన భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికా ఫోటోను అభిమానులతో పంచుకున్న కోహ్లీ.. మహిళాల గొప్పతనం గురించి అద్భుతమైన సందేశం ఇచ్చాడు. తన జీవితంలో తొలిసారి తండ్రి అయిన విరాట్ కోహ్లీ.. ‘మహిళా పథం మహిళ కంటే కూడా శక్తివంతమైనది’ అని పేర్కొన్నాడు. ఇక విరాట్ షేర్ చేసిన ఫోటోలో అనుష్క శర్మ.. వామికా ను ఎత్తుకుని ఆడిస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ కూతరుతో ఉల్లాసంగా ఉంది. అయితే వామికా ముఖం ఆ ఫోటోలో కనిపించలేదు.

‘‘మనిషి జీవితంలో తల్లిదండ్రులైన క్షణానికి మించిన అద్భుతమైన తరుణం మరోటి ఉండదు. పిల్లల జననాన్ని చూసినప్పుడు వెన్నెముకలో ఏదో తెలియని అలజడి కలుగుతుంది. నమ్మశక్య కాని, అద్భుతమైన అనుభూతి ఆ సమయంలో కలుగుతుంది. దానిని చూసిని ఎవరైనా సరే మహిళలు గ్రేట్ అనక మానరు. మహిళా శక్తిని, వారిలో దైవత్వాన్ని అర్థం చేసుకుంటారు. పురుషులకంటే బలవంతులు కాబట్టే మహిళలు మరో జీవితానికి ఊపిరిపోసే అవకాశాన్ని ఆ దేవుడు కల్పించాడు. నా జీవితంలో అంత్యంత ముఖ్యమైన ధైర్యశీలి, దయాగుణం కలిగిన, స్ట్రాంగర్‌ అయిన అనుష్క శర్మ.. తన తల్లిలాగే ఎదుగుతున్న నా కూతురుకి. ప్రపంచంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.’’ అని కోహ్లీ రాసుకొచ్చాడు.

ఇదిలాఉంటే.. స్టార్ కపుల్స్ అయిన విరుష్క జంట జనవరి 11వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనించారు. ఈ విషయాన్ని కోహ్లీ, అనుష్క తమ తమ అభిమానులతో పంచుకున్నారు. ఆ తరువాత ఆ చిన్నారికి వామికా అని పేరు పెట్టినట్లు కూడా వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు వామిక ఫోటో బయటకు రాలేదు. కారణం, విరుష్క జోడీనే. తమ కూతురికి ప్రైవసీ ఎంతో ముఖ్యం అని, ఎవరూ తమ కూతురు ఫోటోలు తీయవద్దంటూ ఫోటోగ్రాఫర్లను విరాట్, అనుష్క దంపతులు కోరారు. అంతేకాదు.. ఆ చిన్నారి ఫోటో బయటకు రాకుండా వీరిద్దరూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Virat Kohli Insta Post:

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

Also read:

Avanthi srinivas : అవంతికి ప్రతిష్టాత్మకంగా విశాఖ ఎన్నికలు, భుజాలపై కుమార్తె ప్రియాంకను గెలిపించుకోవాల్సిన బాధ్యత.!

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో రెచ్చిపోయిన మరో టీడీపీ నేత.. మహిళా కార్యకర్తపై చేయి చేసుకున్న అశోక్ గజపతి రాజు.. వీడియో వైరల్..