Rishabh Pant: క్రికెటర్ రిషభ్ పంత్‌కు రోడ్డు ప్రమాదం.. మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన కారు..

|

Dec 30, 2022 | 9:45 AM

ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న టీమిండియా ప్లేయర్ రిషభ్ పంత్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ బోర్డర్ వద్ద కారు అదుపు తప్పడంతో పక్కనే ఉన్న రెయిలింగ్‌ను కారు ఢీకొట్టింది. దీంతో మంటలు చేలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు వెంటనే..

Rishabh Pant: క్రికెటర్ రిషభ్ పంత్‌కు రోడ్డు ప్రమాదం.. మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన కారు..
Rishabh Pant Met Car Accident Nearby Uttara Khand Border
Follow us on

టీమిండియా యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి, వాహనం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం కారణంగా పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న క్రమంలో పంత్‌కు ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే అతన్ని దగ్గర్లోని హస్పిటల్‌కు తీసుకెళ్లి, అనంతరం ఢిల్లీకి తరలించారు. భారత జట్టు  వికెట్ కీపర్, బ్యాట్స్‌మ్యాన్ రిషబ్‌ పంత్‌ శుక్రవారం ఉదయం ఉత్తరాఖండ్‌ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తుండగా అతని కారు అదుపుతప్పంది. దీంతో ఉత్తరాఖండ్ రూర్కీలోని నర్సన్ సరిహద్దులో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో అతని కారులో మంటలు చెలరేగడంతో అది పూర్తిగా దగ్ధమైంది. అదే క్రమంలో రిషభ్ పంత్‌కు తీవ్రగాయాలయ్యాయి.

దీంతో ఘటనాస్థలంలోని స్థానికులు రిషబ్‌ను రూర్కీ సివిల్‌ హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తీసుకెళ్లవలసిందిగా అక్కడి వైద్యులు రెఫర్ చేయడంతో రాజధానికి తరలించారు.

ఇవి కూడా చదవండి

రిషభ్ పంత్ కారు ప్రమాదం వీడియోను ఇక్కడ చూడండి..

పంత్‌కు ప్లాస్టిక్ సర్జరీ అక్కడే చేస్తారని సక్షమ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సుశీల్ నగర్ నివేదించారు. రిషబ్ పంత్ నుదుటిపైన, కాలికి గాయాలైనట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రిషబ్ పంత్ పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..