India vs England 4th Test: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. హిట్ మ్యాన్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్..!
India vs England 4th Test: టీమిండియా ఓపెనర్, స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డ్ సాధించాడు.
India vs England 4th Test: టీమిండియా ఓపెనర్, స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డ్ సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో 1000 పరుగులు సాధించిన తొలి ఓపెనర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. మోతెరా స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ ఈ రికార్డుకు వేదికగా నిలిచింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 49 పరుగులకే ఔట్ అయినప్పటికీ.. అతితక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే(కేవలం 17 ఇన్నింగ్స్‌ల్లోనే) అత్యంత ఫాస్ట్‌గా 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఓపెనర్‌గా తన పేరిట రికార్డ్ నెలకొల్పాడు. ఇక ఈ జాబితాలో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 948 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా ఆటగాడు డీన్ ఎల్గర్ 848 పరుగులతో మూడో స్థానంలో నిలిచడు. ఇక ఇంగ్లండ్ ఆటగాడు డొమినిక్ సిబ్లి 841, మయాంక్ అగర్వాల్ 810 ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో టీమిండియా తరఫున అజింక్య రహానే ఒక్కడే 1095 అత్యధికంగా పరుగులు చేయగా.. రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. టీమిండియా ప్లేయర్లలో ఏ ఒక్కరూ వెయ్యి పరుగుల మార్కును చేరలేదు.
ఇక ఓవర్‌ఆల్ గా చూసుకున్నట్లయితే.. అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ ప్లేయర్ హెర్బెర్ట్ సట్‌క్లిఫ్ 13 ఇన్నింగ్స్‌లలోనే 1000 పరుగులు పూర్తి చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత లెన్ హటన్ నిలిచాడు. 16 ఇన్నింగ్స్‌లలో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. మూడో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ 17 ఇన్నింగ్స్‌లలో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. అయితే, రోహిత్‌తో సమానంగా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ కూడా ఉన్నాడు.
ఇదిలాఉండగా.. మోతెరా స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ 144 బంతులు ఆడి 49 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు ఉన్నాయి. బెన్ స్టోక్స్ వేసిన బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూ ఔట్ అయ్యాడు. అలా పెవిలియన్ బాట పట్టాడు.
Also read:
Aaron Finch: అత్యధిక సిక్సుల రికార్డులో ఆరోన్ ఫించ్.. తొలి ఆసీస్ ఆటగాడిగా అరుదైన ఘనత..
Assam Elections 2021: అసోం అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ కసరత్తు.. 70 మందితో కూడిన తొలి జాబితా విడుదల