Rahul Dravid: ఆఫ్‌ స్పిన్నర్‌గా మారిన ది వాల్ .. టీమిండియా ప్రాక్టీస్‌ వీడియో వైరల్‌..

|

Nov 24, 2021 | 8:15 PM

టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఆయన పర్యవేక్షణలోని టీమిండియా.. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ 20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది..

Rahul Dravid: ఆఫ్‌ స్పిన్నర్‌గా మారిన ది వాల్ .. టీమిండియా ప్రాక్టీస్‌ వీడియో వైరల్‌..
Follow us on

టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఆయన పర్యవేక్షణలోని టీమిండియా.. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ 20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇప్పుడు టెస్ట్‌ క్రికెట్‌ సమరానికి సిద్ధమవుతోంది. శుక్రవారం (నవంబర్‌25) నుంచి టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అజింక్యా రహానే నేతృత్వంలోని టీమిండియా ప్రాక్టీస్‌లో స్పీడ్‌ పెంచింది. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో మృదు స్వభావిగా పేరొందిన ద్రవిడ్‌ కోచింగ్‌లో మాత్రం కాస్త కఠినంగా వ్యవహరిస్తారని పేరుంది. అంతకుమించి క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యమిస్తారంటారు. అందుకు తగ్గట్లే కివీస్‌తో టెస్ట్‌ సిరీస్‌ కోసం ఆటగాళ్లను రడీ చేస్తున్నాడు. ఈ క్రమంలో టీమిండియా ప్రాక్టీస్‌లో భాగంగా ఆఫ్‌ స్పిన్నర్‌గా అవతారమెత్తాడు రాహుల్‌. స్వయంగా బ్యాటర్లకు బంతులు విసిరి ఆశ్చర్యపరిచాడు.

కాగా దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ‘ఎవరైనా కుడిచేతి వాటం ఆఫ్‌స్పిన్నర్‌ ఉంటారా’ అనే క్యాప్షన్‌ను కూడా జత చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎప్పుడూ బంతిని బాదడమే కానీ చేతితో పట్టుకోని ద్రవిడ్‌ బౌలర్‌గా మారి బంతులు విసరడం క్రికెట్‌ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అందుకే ఈ వీడియోపై లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక విరాట్‌ కోహ్లి, రోహిత్‌, షమీ, బుమ్రా లాంటి సీనియర్లు లేకుండానే కివీస్‌తో టెస్ట్‌ సిరీస్‌కు సిద్ధమవుతోంది టీమిండియా. తాజాగా కే ఎల్‌ రాహుల్‌ కూడా గాయంతో దూరమవ్వడం భారత జట్టుకు పెద్ద దెబ్బే అని భావించవచ్చు.

Womens Cricket: 4-1- 8- 5.. అదిరిపోయే స్పెల్‌ వేసిన ఆసీస్‌ మహిళా క్రికెటర్‌.. బీబీఎల్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు..

Ajaz Patel, sodhi: న్యూజిలాండ్ జట్టులో భారత సంతతి బౌలర్లు.. కాన్పూర్ టెస్ట్‎లో రాణిస్తారా..

Harbhajan Singh: రూ.17.58 కోట్లకు అపార్ట్‌మెంట్‎ను అమ్మిన హర్భజన్ సింగ్.. నాలుగేళ్లలో మూడు కోట్ల లాభం..