IND vs ENG: భారత శిబిరంలో కరోనా కలకలం రేగింది. నిన్న సాయంత్రం ప్రధాన కోచ్ రవిశాస్త్రికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. రవిశాస్త్రితోపాటు సహాయక సిబ్బందిలోని మరో ముగ్గురు సభ్యులు – బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్ కూడా ముందు జాగ్రత్తల కోసం ఐసోలేషన్‌లోకి వెళ్లారు.
వీరు RT-PCR పరీక్ష చేయించుకున్నారు. టీమిండియాలోని ఆటగాళ్లు మొత్తం హోటల్‌లో ఉండనున్నారు. వైద్య బృందం నుంచి ధృవీకరణ వచ్చేవరకు భారత ఆటగాళ్లతో కలిసి ప్రయాణించరు.
టీమిండియా బృందంలోని మిగిలిన సభ్యులు రెండు లాటరల్ ఫ్లో టెస్టులు చేయించుకున్నారు. అయితే వీరికి మాత్రం రిపోర్టుల్లో పాజిటివ్ తేలకపోవడంతో.. ఓవల్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆడేందుకు అనుమతించారు.
భారత్, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఓవల్‌లో 4వ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్‌లో భాగంగా మూడో రోజు ఆటముగిసే సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ 22 పరుగులు, రవీంద్ర జడేజా 9 పరుగులతో ఉన్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ(127) విదేశాల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. కేఎల్ రాహుల్ 46, పుజారా 61 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్‌పై 171 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్స్ సన్ 2 వికెట్లు, అండర్సన్ 1 వికెట్ పడగొట్టారు.
UPDATE – Four members of Team India Support Staff to remain in isolation.
More details here – https://t.co/HDUWL0GrNV #ENGvIND pic.twitter.com/HG77OYRAp2
— BCCI (@BCCI) September 5, 2021
Also Read:
11 ఏళ్ల కెరీర్‌లో 11 వికెట్లు కూడా తీయలేదు.. చెత్త బౌలింగ్‌కు ఇతడే నిదర్శనం.. ఎవరో తెలుసా!
Paralympics: దుమ్ములేపుతున్న భారత్ అథ్లెట్స్.. ఖాతాలోకి మరో గోల్డ్ మెడల్..