AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Super Sixer: క్లబ్ మ్యాచ్ లో కళ్ళు చెదిరే సిక్స్..సంబరాలు చేసుకున్న క్రికెటర్..తీరా మ్యాచ్ అయ్యాకా షాక్.. ఎందుకంటే

Super Sixer: వాళ్ళూ వీళ్ళూ చెప్పడమే కానీ నా బాదుడు ఇలా ఉంటుందని నాకు తెలీదు అని బేర్ మంటున్నాడు ఆ బైట్స్ మన్. సాధారణంగా గ్రౌండ్ లో క్రికెట్ ఆడేటప్పుడు బాల్ గట్టిగా కొడితే స్టేడియంలో కూచున్న వాళ్ళ మీదకు పోవడం జరుగుతూనే ఉంటుంది.

Super Sixer: క్లబ్ మ్యాచ్ లో కళ్ళు చెదిరే సిక్స్..సంబరాలు చేసుకున్న క్రికెటర్..తీరా మ్యాచ్ అయ్యాకా షాక్.. ఎందుకంటే
Super Sixer
KVD Varma
|

Updated on: Jun 21, 2021 | 9:51 PM

Share

Super Sixer: వాళ్ళూ వీళ్ళూ చెప్పడమే కానీ నా బాదుడు ఇలా ఉంటుందని నాకు తెలీదు అని ‘బేర్’ మంటున్నాడు ఆ బైట్స్ మన్. సాధారణంగా గ్రౌండ్ లో క్రికెట్ ఆడేటప్పుడు బాల్ గట్టిగా కొడితే స్టేడియంలో కూచున్న వాళ్ళ మీదకు పోవడం జరుగుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు స్టేడియం బయటా పడుతుంది. ఒక్కో బ్యాట్స్ మన్ కొట్టిన సిక్స్ అలా గాల్లో ఎగిరి స్టేడియం దాటిపోతే అభిమానులు ఆశ్చర్యంగా సంబరంగా చూస్తారు. బ్యాట్స్ మన్ తన బాదుడుకు తానే మురిసిపోతాడు. కానీ, పాపం ఈ బ్యాట్స్ మన్ కు ఆ మురిపెం ఎంతో సేపు నిలవలేదు.. ఎందుకో తెలుసా? ఇదిగో ఈ వివరాలు చూస్తె మీకూ తెలుస్తుంది. మీరు ఆ బ్యాట్స్ మన్ పరిస్థితికి కచ్చితంగా అయ్యో అని జాలిపడతారు.

ఇంగ్లాండ్ లోని సెయింట్ మేరీ క్రికెట్ క్లబ్ తరఫున ఇల్లింగ్ వర్త్ అనే ఆటగాడు ఉన్నాడు. ఈయనగారు ఆసిఫ్ ఆలే క్లబ్ మ్యాచ్ లో ఆడుతున్నాడు. కష్టపడి బ్యాటింగ్ చేస్తున్న మనోడికి బౌలర్ చక్కటి బాల్ వేశాడు. అంతే ఇక ఇల్లింగ్ వార్ట్ దొరికింది చాన్స్ అని దాన్ని చాచిపెట్టి బాదేశాడు. దెబ్బకు బాల్ వెళ్లి స్టేడియం అవతల పడింది. ఇక మనోడి భారీ సిక్స్ అందరూ ఆహా ఓహో అన్నారు. మన వీరుడు కూడా గర్వంగా తలెగరేశాడు. కొంత సేపటికి ఆరోజు మ్యాచ్ పూర్తయింది. తెగ బ్యాటింగ్ చేసిన ఆనందంలో ఇంటికి వెళ్ళడం కోసం బయలు దేరాడు ఆ క్రికెటర్. స్టేడియం బయట పెట్టిన కారు వద్దకు వచ్చాడు. అంతే అక్కడి పరిస్థితి చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే, అతని కారు బ్యాక్ విండ్ షీల్డ్ పగిలిపోయి ఉంది. దీంతో అసలు సంగతి ఏమిటా అని తెలుసుకున్నాడు ఆ క్రికెటర్. సంగతి తెలిసిన తరువాత తన బాదుడే తన కారుకు ఈ పరిస్థితి తెచ్చింది అని తెలుసుకుని బావురుమన్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మనోడు కొట్టిన సూపర్ సిక్స్ బాల్ తన కారు అద్దాన్నే ముద్దాడింది. అదీ సంగతి. పాపం తన ఆటతో తన కారు అద్దాన్నే బద్దలు కొట్టుకుని బాధపడ్డాడు ఆ క్రికెటర్.

ఇదిగో ఇక్కడ మన హీరో కొట్టిన సిక్స్(Super Sixer) చూడండి.. తరువాత అతని కారు దుస్థితీ చూడండి.

Also Read: Sachin Tendulkar: గ్రేటెస్ట్‌ మెన్స్‌ టెస్ట్‌ బ్యాట్స్‌ మెన్‌ గా ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్.. ( వీడియో )

Best Fielders: మ్యాచ్‌లను మలుపు తిప్పిన ఆల్‌ టైం సూపర్ ఫీల్డర్స్‌..! వారెవరంటే..?

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!