India squad: సఫారీలతో టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టును ప్రకటన.. 5 నెలల తర్వాత డేంజరస్ ప్లేయర్ రీ ఎంట్రీ..

త్వరలో సౌతాఫ్రికాతో జరిగే టెస్ట్‌ సిరీస్‌ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌ నవబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. సౌతాఫ్రికా టూర్‌లో భాగంగా భారత్‌ ఆ జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే సఫారీలతో జరగనున్న ఈ సిరీస్‌కు ఇంగ్లాండ్‌ టూర్‌లో గాయపడిన రిషభ్‌ పంత్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

India squad: సఫారీలతో టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టును ప్రకటన.. 5 నెలల తర్వాత డేంజరస్ ప్లేయర్ రీ ఎంట్రీ..
Indian Team

Updated on: Nov 05, 2025 | 8:39 PM

దక్షిణాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ నవంబర్ 14న ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో T20 సిరీస్‌లో ఆడుతున్న శుభ్‌మాన్ గిల్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. అయితే సఫారీలతో జగనున్న ఈ సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌ టూర్‌లో గాయం కారణంగా దూరమైన స్టార్ ప్లేయర్ వికెట్‌ కీపర్ రిషబ్‌ పంత్‌ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

జట్టులోకి స్లార్‌ ప్లేయర్ రీ ఎంట్రీ

గత జులై 23న ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో పాదానికి గాయమైన కారణంగా రిషబ్‌ పంత్‌ వెస్టిండీస్ తో జరిగిన స్వదేశీ టెస్ట్ సిరీస్ లో ఆడలేకపోయాడు. అయితే ఇప్పుడు అతను మ్యాచ్‌లు ఆడేందుకు పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్టు గుర్తించిన బీసీసీఐ.. పంత్‌ను సౌతాఫ్రికా-ఎ, ఇండియా-ఎ మధ్య జరుగుతున్న రెండు అనధికారిక టెస్టులకు ఎంపిక చేసింది. దీంతో పంత్‌ మళ్లీ జట్టులోకి తిరిగి రాగలిగాడు. మునుపటి సిరీస్ లో జట్టులో లేని ఆకాష్ దీప్ కూడా ఇప్పుడు జట్టులోకి తిరిగి వచ్చాడు.

ఇదిలా ఉండగా, గత టెస్ట్ సిరీస్‌లో భాగమైన ఇద్దరు ఆటగాళ్లను బీసీసీఐ ఈ సారి బయటకు పంపింది. గత సిరీస్‌లో వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ ఉన్న ఎన్. జగదీశన్, ఫాస్ట్ బౌలర్ ప్రసాద్ కృష్ణను బీసీసీఐ ఈ సిరీస్‌ నుంచి తప్పించింది. వీరిద్దరికీ వెస్టిండీస్‌తో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అలాగే ఇప్పుడు వారు జట్టులో స్థానం కూడా కోల్పోయారు. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ నవంబర్ 14 నుండి 18 వరకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. రెండవ టెస్ట్ గౌహతిలోని ACA స్టేడియంలో జరుగుతుంది. ఆ తర్వాత, రెండు జట్లు వన్డే సిరీస్‌లో ఆడతాయి.

టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన

సౌతాఫ్రికాతో టెస్టులు ఆడనున్న భారత జట్టు ఇదే: శుభ్‌మన్ గిల్‌ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌, దేవ్‌దత్ పడిక్కల్‌, ధ్రువ్‌ జురెల్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్‌ పటేల్‌, నితీశ్‌ రెడ్డి, సిరాజ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ఆకాశ్‌ దీప్‌.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.