ప్రపంచ చాంపియన్లను మట్టికరిపించి.. చరిత్ర సృష్టించారు

| Edited By: Pardhasaradhi Peri

Aug 05, 2019 | 9:15 AM

థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత షట్లర్లు, తెలుగు ప్లేయర్ సాత్విక్- చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. పురుషుల డబుల్స్‌లో భాగంగా జరిగిన ఫైనల్‌లో ప్రపంచ చాంపియన్ ద్వయాన్ని ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నారు ఈ కుర్ర ద్వయం. ఆదివారం బ్యాంకాక్‌లో జరిగిన ఫైనల్లో సాత్విక్- చిరాక్ ద్వయం 21-19, 18-21. 21-18తో చైనా ద్వయం లీ జున్ హుయ్- లీ యూ చెన్‌ను మట్టికరిపించారు. దీంతో బీడబ్ల్యూఎఫ్ సూపర్-500 టైటిల్ కైవసం చేసుకున్న తొలి భారత జోడీగా వీరిద్దరు […]

ప్రపంచ చాంపియన్లను మట్టికరిపించి.. చరిత్ర సృష్టించారు
Follow us on

థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత షట్లర్లు, తెలుగు ప్లేయర్ సాత్విక్- చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. పురుషుల డబుల్స్‌లో భాగంగా జరిగిన ఫైనల్‌లో ప్రపంచ చాంపియన్ ద్వయాన్ని ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నారు ఈ కుర్ర ద్వయం. ఆదివారం బ్యాంకాక్‌లో జరిగిన ఫైనల్లో సాత్విక్- చిరాక్ ద్వయం 21-19, 18-21. 21-18తో చైనా ద్వయం లీ జున్ హుయ్- లీ యూ చెన్‌ను మట్టికరిపించారు. దీంతో బీడబ్ల్యూఎఫ్ సూపర్-500 టైటిల్ కైవసం చేసుకున్న తొలి భారత జోడీగా వీరిద్దరు చరిత్ర సృష్టించారు.

తుదిపోరులో సాత్విక్-చిరాగ్ జోడి 62 నిమిషాల పాటు చైనీస్ జోడీతో హోరాహోరీగా తలపడింది. తొలి గేమ్ నుంచే మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. 3-3తో సమమైన స్కోర్ నుంచి పోటీ ప్రారంభం కాగా.. భారత ద్వయం దూకుడు ప్రదర్శించి 10-6కు చేరింది. వెంటనే చైనీస్ జోడీ విజృంభించడంతో స్కోరు 14-14కు చేరింది. అక్కడి నుంచి మళ్లీ తీవ్రంగా పోరాడిన సాత్విక్-చిరాగ్ జోడీ 21-19తో గేమ్‌ను కైవసం చేసుకున్నారు. ఇక రెండో గేమ్‌లో 18-21తో చైనా ద్వయం రెచ్చిపోగా.. మూడో గేమ్‌లో 21-18 తేడాతో సాత్విక్-చిరాగ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.