Asian Games 2023: చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ.. బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి స్వర్ణం..

Satwiksairaj Rankireddy and Chirag Shetty: చైనాలోని హాంగ్‌జౌలో శనివారం జరిగిన ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి , చిరాగ్‌ శెట్టిలు భారత్‌కు తొలి స్వర్ణం అందించారు. వచ్చే వారం ప్రపంచ నంబర్ 1 కిరీటాన్ని కైవసం చేసుకోనున్న వీరిద్దరూ పురుషుల డబుల్స్ ఫైనల్లో 21-18, 21-16తో రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు చెందిన చోయ్ సోల్గ్యు-కిమ్ వోన్హో జోడీని 56 నిమిషాల్లో ఓడించారు.

Asian Games 2023: చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ.. బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి స్వర్ణం..
Rankireddy And Chirag Shett
Follow us
Venkata Chari

|

Updated on: Oct 07, 2023 | 2:22 PM

Satwiksairaj Rankireddy and Chirag Shetty: హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు పతకాలతో సత్తా చాటుతున్నారు. భారత ఆటగాళ్లు నిరంతరం పతకాలు సాధిస్తూ చరిత్ర సృష్టిస్తున్నారు. శనివారం బ్యాడ్మింటన్‌లో భారత్‌ చరిత్రాత్మక విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో భారత జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ జోడీ ఫైనల్లో దక్షిణ కొరియా జోడీని ఓడించి ఈ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆసియా క్రీడల్లో పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం గమనార్హం.

57 నిమిషాల్లో ముగిసిన గేమ్..

దక్షిణ కొరియాకు చెందిన చోయ్ సోయి, కిమ్ వోన్‌హూలను ఓడించడంలో చిరాగ్, సాత్విక్ పెద్దగా ఇబ్బంది పడలేదు. ఈ మ్యాచ్‌లో 21-18, 21-16తేడాతో విజయం సాధించింది. తొలి గేమ్‌లో విజయం సాధించేందుకు భారత జోడీకి కేవలం 29 నిమిషాల సమయం పట్టినా రెండో గేమ్‌లో దక్షిణ కొరియా జోడీ భారత్‌కు గట్టిపోటీనిచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌లో చిరాగ్, సాత్విక్ విజయం సాధించారు. ఈ మ్యాచ్ 57 నిమిషాల పాటు సాగింది. ఈసారి ఈ జోడీ గోల్డ్ మెడల్ తెస్తుందని అంతా భావించారు. ఈ ఏడాది వీరిద్దరి ప్రదర్శనే ఇందుకు కారణం. 2023 సంవత్సరంలో, చిరాగ్, సాత్విక్ స్విస్ ఓపెన్, బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్, ఇండోనేషియా ఓపెన్, కొరియా ఓపెన్ టైటిళ్లను గెలుచుకున్నారు.

ఇవి కూడా చదవండి

దీనికి ముందు భారత మహిళల కబడ్డీ జట్టు కూడా అద్భుతంగా గెలిచి దేశానికి బంగారు పతకాన్ని అందించింది. ఫైనల్లో చైనీస్ తైపీ జోడీని 26-25తో ఓడించి భారత జట్టు పతకాన్ని కైవసం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..