“సచిన్ సెంచరీ మిస్ అయినందుకు చాలా బాధపడ్డా”
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. ఈ రెండు టీమ్స్ క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే ప్రపంచంలోని చాలా దేశాల క్రీడా అభిమానులు ఎంతో ఉత్కంఠతో వీక్షిస్తారు. ఇరు దేశాల ఫ్యాన్స్ తో పాటు ఆటగాళ్ల మధ్య కూడా భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి. సాధారణంగా ప్రత్యర్థి ప్లేయర్స్ రాణించకూడదని, ఆ టీమ్ ఓడిపోవాలనే అందరూ కోరుకుంటారు. అయితే ఓ మ్యాచ్‌లో పాక్ మాజీ పేసర్ అక్తర్ మాత్రం క్రికెట్ గాడ్ సచిన్ సెంచరీ మిస్ అవ్వడంతో ఎంతో […]

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. ఈ రెండు టీమ్స్ క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే ప్రపంచంలోని చాలా దేశాల క్రీడా అభిమానులు ఎంతో ఉత్కంఠతో వీక్షిస్తారు. ఇరు దేశాల ఫ్యాన్స్ తో పాటు ఆటగాళ్ల మధ్య కూడా భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి. సాధారణంగా ప్రత్యర్థి ప్లేయర్స్ రాణించకూడదని, ఆ టీమ్ ఓడిపోవాలనే అందరూ కోరుకుంటారు. అయితే ఓ మ్యాచ్‌లో పాక్ మాజీ పేసర్ అక్తర్ మాత్రం క్రికెట్ గాడ్ సచిన్ సెంచరీ మిస్ అవ్వడంతో ఎంతో బాధపడ్డాటట. .
“2003 వరల్డ్ కప్ మాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ 98 రన్స్ వద్ద ఔటవ్వడం బాధించింది. అది చాలా స్పెషల్ ఇన్నింగ్స్. అతడు సెంచరీ చేయాల్సింది. సచిన్ సెంచరీ బాదితే చూడాలనుకున్నా. నేను వేసిన బౌన్సర్‌కు ఔటవ్వకుండా సిక్సర్ బాదితే బాగుండేది” అని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.
సెంచూరియన్‌లో భారత్-పాక్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ మొదట 273/7 రన్స్ చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ కు దిగిన భారత్‌కు సచిన్, సెహ్వాగ్ శుభాన్నిచ్చారు. మాస్టర్ బ్లాస్టర్ 75 బంతుల్లోనే 98( 12 బౌండరీలు, ఒక సిక్సర్) పరుగులు చేశాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ (44), యువరాజ్ సింగ్ హాఫ్ సెంచరీ చేయడం వల్ల టీమ్‌ఇండియా విజయకేతనం ఎగరవేసింది.