ఐపీఎల్ నిర్వహణ దిశగా బీసీసీఐ.. ఎప్పుడంటే..

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. దీంతో ఐపీఎల్ ను రద్దు చేశారు. అయితే.. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌ను మళ్లీ

  • Tv9 Telugu
  • Publish Date - 3:57 pm, Wed, 20 May 20
ఐపీఎల్ నిర్వహణ దిశగా బీసీసీఐ.. ఎప్పుడంటే..

IPL 2020: కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. దీంతో ఐపీఎల్ ను రద్దు చేశారు. అయితే.. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌ను మళ్లీ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పావులు కదుపుతోంది. తొలుత ఈ లీగ్‌ను మార్చి 29న నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ, లాక్‌డౌన్ ఉండటంతో దాన్ని ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత లాక్‌డౌన్‌ను పొడిగించడంతో.. తాత్కాలికంగా లీగ్‌ను రద్దు చేశారు.

కాగా.. ఐపీఎల్‌ను ఈ ఏడాదిలోనే నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీ నుంచి నవంబర్ 1 వరకూ ఈ లీగ్‌ను నిర్వహించాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు అధికారి తెలిపారు. అయితే బీసీసీఐ నుంచి అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదని.. ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన వచ్చిన తర్వాతే దీనిపై బీసీసీఐ ప్రకటన చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

Also Read: ఏపీలో రేపటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల హాజరు తప్పనిసరి..